5G offers: ఎయిర్‌టెల్, జియోలపై వొడాఫోన్ ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5G 0ffers: దేశీయ టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ ఉచిత 5జీ సేవలను అందించడంపై మరో టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎయిర్‌టెల్, జియోలపై ఫిర్యాదు చేస్తూ వోడాఫోన్ ఐడియా టెలికాం రెగ్యులేటరీ అథారిటీకి లేఖ రాసింది. దీంతో ఎయిర్‌టెల్, జియోలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఇరు సంస్థలు తమ వాదనలు వినిపించాయి. తాము అందించే 5G సేవలు ఉచితం కాదని Jio మరియు Airtel పేర్కొన్నాయి. కొన్ని ఎంపిక చేసిన 4G ప్లాన్‌లను సబ్‌స్క్రయిబ్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే వాటిని అందిస్తున్నట్లు తెలిపింది. దేశంలో 5జీ సేవలను ప్రవేశపెట్టిన సందర్భంగా ‘ఎయిర్‌టెల్ 5జీ ప్లస్’ నెట్‌వర్క్ ద్వారా వినియోగదారులు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను పొందవచ్చని కంపెనీ తెలిపింది. ₹ 239 కంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకునే 5G ఫోన్‌ని ఉపయోగించే పోస్ట్‌పెయిడ్ మరియు ప్రీపెయిడ్ వినియోగదారులు 5G సేవలను పొందవచ్చని Airtel ప్రకటించింది. అయితే వినియోగదారులు ఆశించిన స్థాయిలో 5జీ సేవలను వినియోగించుకోవడం లేదని రెండు సంస్థలు తెలిపాయని ట్రాయ్ వెల్లడించింది. వోడాఫోన్ ఐడియా ఫిర్యాదుపై మేము జియో మరియు ఎయిర్‌టెల్‌లకు నోటీసులు జారీ చేసాము. రెండు సంస్థలు తమ వాదనలు వినిపించాయి. ట్రాయ్‌లోని న్యాయ, ఆర్థిక, సాంకేతిక విభాగాల ప్రతినిధులు వీటిపై చర్చిస్తున్నారు. వారి సూచన మేరకు నిర్ణయం తీసుకుంటాం’’ అని ట్రాయ్ పేర్కొంది.
Read also: Fake notes: నకిలీ నోట్లొస్తున్నాయి.. జాగ్రత్త
Also Read
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
- Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
- Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
టెలికాం ఆపరేటర్లు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2016లో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా జియో యొక్క తక్కువ-ధర టెలికాం సేవలపై TRAIకి ఫిర్యాదు చేశాయి. జియో టీవీలో ఐపీఎల్ ప్రసారాలపై ఎయిర్‌టెల్ కొద్ది రోజుల క్రితం ట్రాయ్‌కి ఫిర్యాదు చేసింది. దీనిపై జియో ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశపూర్వకంగానే ఎయిర్‌టెల్ ఈ ఫిర్యాదు చేసిందని TRAIకి రాసిన లేఖలో జియో పేర్కొంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలు మరియు పట్టణాల్లో Airtel మరియు Jio 5G సేవలను అందజేస్తుండగా, Vodafone Idea కొన్ని ప్రాంతాలలో ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే ఈ సేవలను అందిస్తోంది.
DGP Anjani Kumar: సైబర్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు.. దేశంలోనే తెలంగాణ ఫస్ట్
తాజావార్తలు
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!