Fake notes: నకిలీ నోట్లొస్తున్నాయి.. జాగ్రత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake notes: నకిలీ నోట్లను చలామణి చేస్తూ కొన్ని ముఠాలు ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. సైబరాబాద్ పోలీసులు రెండు నెలలుగా సాగుతున్న విచారణలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ప్రధాన నిందితులు నకిలీ నోట్లను చలామణి చేసేందుకు ఏజెంట్లను నియమించుకుని వాటి ద్వారా వాటిని మార్కెట్ చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనధికారికంగా రెండు నుంచి మూడు కోట్ల వరకు నకిలీ నోట్లు చెలామణి అవుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన నిందితులు తమ ఏజెంట్లకు నకిలీ నోట్లను అందజేస్తున్నారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పోలీసులు ఇప్పుడు నకిలీ నోట్ల వ్యవహారంపై దృష్టి సారించారు.
చిరువ్యాపారులను టార్గెట్ చేస్తూ నకిలీ నోట్లు ఎక్కువగా చెలామణి అవుతున్నందున వారికి నకిలీ నోట్లపై అవగాహన కల్పించనున్నారు. నకిలీ నోట్లను తయారు చేయడంతో పాటు నకిలీ నోట్లను మార్కెట్ చేయడానికి నేరస్థులు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లను కూడా ఉపయోగిస్తున్నారు. దీంతో ఇలాంటి వారి పట్ల సామాన్యులు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి సమాచారం గుర్తిస్తే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు. నోట్ల భద్రత కోసం ఆర్‌బీఐ 17 అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంది. సామాన్య పౌరులకు ఈ విషయాలన్నీ తెలుసుకునే అవకాశం లేదు. కనీసం కొన్నింటిని జాగ్రత్తగా పరిశీలించాలి. నోట్ నాణ్యత, నోట్ నలుమూలలా సరిగ్గా ఉండాలి. నోట్‌పై ఉన్న గీతలు చేతికి తాకాలి. 500 అని నోట్‌పై పువ్వులో రాయాలి. ఒక్క సెక్యూరిటీ థ్రెడ్ మాత్రమే ఉంది. గాంధీ విగ్రహం పక్కన 500 అని రాసి ఉంటుందని గమనించాలని సూచించారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
Read also: DGP Anjani Kumar: సైబర్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు.. దేశంలోనే తెలంగాణ ఫస్ట్
కాగా.. సైబరాబాద్ పరిధిలో నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న 13 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ముఠాకు సరఫరా అవుతున్న నకిలీ నోట్లు బాండ్ పేపర్‌తో తయారు చేసిన నకిలీ నోట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా అవసరాన్ని బట్టి నకిలీ నోట్లను తయారు చేసి, ముందుగా తయారు చేసినవి మార్కెట్‌కు వెళ్లిన తర్వాత కొత్త నోట్లను ముద్రిస్తున్నారు. ఇందుకు గ్రామీణ ప్రాంతాలను అవకాశంగా తీసుకుంటున్నారు. నకిలీ నోట్లను గుర్తించేంత నైపుణ్యం లేని ప్రాంతాలను గుర్తించి అక్కడ చెలామణి చేస్తున్నారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. అసలైన నోట్లను పోలిన నకిలీ నోట్లను తయారు చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. చిన్న కిరాణా దుకాణాలు, వీక్లీ మార్కెట్లు, పాన్ షాపులు, గ్రామాల్లోని మద్యం దుకాణాలు, పెట్రోల్ పంపులు, రైస్ మిల్లులు, మనీ ట్రాన్స్‌ఫర్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్లు, పాల దుకాణాలు, ఈవెంట్‌లు, కాలేజీ ఫెస్ట్‌లు, స్క్రాప్ షాపులు, పుష్కరాలు, లేబర్ స్టాల్స్ లక్ష్యంగా ఈ నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయని చిరు వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాంటి వారు ఎవరైనా మీ పరిధిలోకి వస్తే వెంటనే పోలీసులకు సమచారం ఇవ్వాలని కోరారు.
TSRTC Offer: భారీగా తగ్గిన ఆర్టీసీ బస్సు చార్జీలు.. ప్రయాణికులకు పండగే
తాజావార్తలు
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్ప్లే
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!