Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు ప్రముఖ దిగ్గజ సంస్థ ఐటీసీ (ITC) షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ (GST) రేటును 40 శాతానికి పెంచడంతో పాటు కొత్తగా అదనపు ఎక్సైజ్ డ్యూటీని విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పన్నుల భారాన్ని తట్టుకునేందుకు ఐటీసీ మరోసారి తన పాపులర్ బ్రాండ్ల ధరలను సవరించింది. డీలర్ల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త ధరలతో కూడిన సిగరెట్ ప్యాకెట్లు ఇప్పటికే రావడం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా క్లాసిక్ కనెక్ట్ (Classic Connect), గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ (Gold Flake Super Star) బ్రాండ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. 20 సిగరెట్లు ఉండే క్లాసిక్ కనెక్ట్ ప్యాకెట్ ధర ఇంతకుముందు రూ. 390 ఉండగా, ఇప్పుడు ఏకంగా 9.74 శాతం పెరిగి రూ. 428కి చేరింది. అలాగే 10 సిగరెట్లు ఉండే గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ ప్యాకెట్ రూ. 79 నుంచి ఏకంగా 12.66 శాతం పెరిగి రూ. 89కి చేరింది.
పన్నుల భారం నుంచి బయటపడేందుకు ఐటీసీ ధరలు పెంచడం ఇది మొదటిసారేమీ కాదు. ఈ ఏడాది ప్రారంభంలో పన్నుల విధానం మారిన వెంటనే క్లాసిక్ కనెక్ట్ ధర రూ. 300 నుంచి రూ. 360కి, ఆ తర్వాత రూ. 390కి పెరిగింది. గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ ధర కూడా రూ. 59 నుంచి మొదట రూ. 70కి చేరింది. ఆ తర్వాత మే నెలలో రెండో దఫా పెంపులో భాగంగా ఈ గోల్డ్ ఫ్లేక్ ప్యాకెట్ ధరను రూ. 70 నుంచి రూ. 79కి పెంచారు. ఇప్పుడు దాన్ని మరింత పెంచి రూ. 89కి తీసుకెళ్లారు. పన్నుల రేట్లు మారినప్పటి నుంచి ఐటీసీ వరుసగా ధరలను సమీక్షిస్తూ వినియోగదారులపై భారం మోపుతుండటంతో, రాబోయే రోజుల్లో సిగరెట్ల విక్రయాల పరిమాణం (సేల్స్ వాల్యూమ్స్) తగ్గే అవకాశం ఉందంటూ ప్రముఖ రేటింగ్ సంస్థ నోమురా (Nomura) హెచ్చరించింది.
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!