Call Merging Scam: యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. కాల్ మెర్జ్ చేస్తున్నారా? మీ ఖాతా ఖాళీ అవుతుంది జాగ్రత్త!
- యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్
- కొత్త కాల్ మెర్జింగ్ స్కామ్
- కాల్ మెర్జ్ చేశారో మీ ఖాతాలోని డబ్బులు ఖాళీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీని వాడుకుని సైబర్ నేరగాళ్లు చేసే మోసాలు అన్నీఇన్నీ కావు. ఫేక్ మెసేజ్ లు, కాల్స్, లింక్స్ పంపి అమాయకులను మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్, మిస్డ్ కాల్ స్కామ్ ల ద్వారా బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. అదే కాల్ మెర్జింగ్ స్కామ్. దీనిపై యూజర్లకు యూపీఐ బిగ్ అలర్ట్ ఇచ్చింది. మీరు పొరపాటున కాల్ మెర్జ్ చేశారో మీ ఖాతాలోని డబ్బులు ఖాళీ అయినట్టే. మరి కాల్ మెర్జింగ్ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- Ethanol in Diesel: డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
కాల్ మెర్జింగ్ స్కామ్ లో సైబర్ క్రిమినల్స్ యూపీఐ యూజర్లను కాల్ మెర్జింగ్ పేరిట మోసం చేసి తెలియకుండానే వారి వన్ టైమ్ పాస్ వర్డ్ లను OTP కాజేస్తున్నారు. ఇది స్కామర్లు అనధికార లావాదేవీలు, ఖాతాలు లూటీ చేయడానికి అనుకూలంగా మారింది. అయితే దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), అఫీషియల్ X ఖాతాలో, వినియోగదారులను హెచ్చరించింది, “స్కామర్లు మిమ్మల్ని మోసం చేసి OTP లను దొంగిలించడానికి కాల్ మెర్జింగ్‌ను ఉపయోగిస్తున్నారు. స్కామర్ల వలలో పడకండి. అప్రమత్తంగా ఉండండి, మీ డబ్బును కాపాడుకోండి.” అంటూ అలర్ట్ చేసింది.
Also Read:CM Revanth Reddy : ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ కఠిన చర్యలు.. ఉచిత ఇసుక సరఫరాకు ప్రత్యేక కమిటీ
ఇంతకీ ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ ఎలా జరుగుతుందంటే.. ఒక అపరిచితుడు మీ ఫ్రెండ్ నుంచి నెంబర్ తీసుకుని కాల్ చేస్తున్నట్లు చెప్పడంతో ప్రారంభమవుతుంది.ఆ తర్వాత స్కామర్ ఆ స్నేహితుడు వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని కాల్ మెర్జ్ చేయమని కోరతాడు. కానీ ఆ కాల్ ఫ్రెండ్ నుంచి వచ్చింది కాదు OTP నుంచి వచ్చింది. ఇక కాల్ మెర్జ్ కాగానే ఆ వ్యక్తికి తెలియకుండానే వారి బ్యాంక్ నుంచి చట్టబద్దమైన OTP ధృవీకరణ కాల్ తో కనెక్ట్ అవుతారు.
Also Read:CM Chandrababu: జీబీఎస్‌పై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
దీంతో స్కామర్ కాల్ లోని OTPని విని మీ బ్యాంక్ ఖాతాను లూటీ చేస్తాడు. ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే తెలియని నెంబర్లతో వచ్చిన కాల్స్ ను మెర్జ్ చేయకూడదు. బ్యాంకు నుంచి లేదా ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చినట్లైతే నిజ నిర్థారణ చేసుకోవాలి. మీరు చేయని ట్రాన్సాక్షన్ కు OTP వస్తే మీ బ్యాంకును అప్రమత్తం చేసి 1930కి కంప్లైంట్ చేయాలి.
Scammers are using call merging to trick you into revealing OTPs. Don’t fall for it! Stay alert and protect your money. 🚨💳 Share this post to spread awareness!#UPI #CyberSecurity #FraudPrevention #StaySafe #OnlineFraudAwareness #SecurePayments pic.twitter.com/kZ3TmbyVag
— UPI (@UPI_NPCI) February 14, 2025
తాజావార్తలు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..