Liquor Prices: యూకే-ఇండియా డీల్.. భారీగా మద్యం స్టాక్స్ పతనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Prices: భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ (UK) మధ్య వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement – FTA) లిక్కర్ రంగంలోని స్టాక్స్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల ప్రముఖ మద్యం కంపెనీల షేర్లు పడిపోయాయి. ఈ ఒప్పందంలో స్కాచ్, విస్కీ, జిన్‌పై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించడం వల్ల మార్కెట్‌లో ధరల పోటీ పెరిగే అవకాశంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు.
Rajasthan: రాజస్థాన్‌లో ఘోర విషాదం.. స్కూల్ బిల్డింగ్ కూలి నలుగరు మృతి
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్‌లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
ఈ వాణిజ్య ఒప్పందం ప్రకారం.. ప్రస్తుతం 150% దిగుమతి సుంకం ఉన్న స్కాచ్, జిన్‌పై మొదటగా 75%కు తగ్గింపు చేయనున్నారు. ఆ తర్వాత దశలవారీగా 10 సంవత్సరాల్లో 40%కి తగ్గింపు చేయనున్నారు. దీనితో భారీగా దిగుమతి మద్యం ధరలు తగ్గనున్నాయి. ఇలా సుంకాలు తగ్గించడంతో అంతర్జాతీయ బ్రాండ్లు జానీ వాకైర్, చివాస్ రీగల్, బాలంటైన్ లాంటి వాటికి లాభదాయకంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఒక్కో బాటిల్ కు 100 నుంచి 300 రూపాయలు వరకూ తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇక్కడ మరొక కీలకమైన అంశం ఏమిటంటే.. మద్యం ధరలపై రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీలు, ఎక్స్-డిస్టిలరీ ప్రైసింగ్ లాంటి అంశాలు రాష్ట్ర ఆదాయానికి ప్రధాన వనరులు కావడంతో ఈ ఒప్పంద ప్రభావం వినియోగదారులకు పూర్తిగా చేరకపోవచ్చు.
భారతదేశం గత దశాబ్దంలో జరిగిన తొలి అతిపెద్ద FTA అయినప్పటికీ, మద్యం రంగంపై దీని తక్షణ ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఇది ఒకదానిపై మౌలిక ప్రభావం చూపకపోవచ్చు కానీ.. ప్రీమియం బ్రాండ్ల పోటీ దేశీయ కంపెనీలకు మానిటరీ, మార్కెట్ భాగస్వామ్యంలో సమస్యలు తలెత్తించే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ఈ తాజా ఒప్పంద వల్ల Radico Khaitan షేరు ధర 1.69% మేర పడిపోయింది. అదే విధంగా, Tilaknagar Industries షేర్లు 2.09% నష్టపోయాయి. ప్రముఖ బ్రాండ్ అయిన United Spirits షేరు ధర కూడా 0.69% మేర తగ్గింది. ఈ పతనాలు భారత్-యూకే మధ్య కుదిరిన FTA ఒప్పంద ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అయితే భారత బ్రేవెర్స్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి మాట్లాడుతూ.. ప్రస్తుత ధర తగ్గింపులు తాత్కాలికంగానో, పరిమితంగానో ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..