గజం భూమి అయినా వదులుకుంటరేమో కానీ, గ్రామ్ బంగారం మాత్రం వదులుకోలేని పరిస్థితి. ఎందుకంటే గోల్డ్ ధరలు ఆ రేంజ్ లో పరుగులు పెడుతున్నాయి. పుత్తడిపై పెట్టుబడి పెట్టితే లాభాలు అందుకోవడం ఖాయం అంటున్నారు నిపుణులు. ఇక ఇప్పుడు శుభకార్యాల సీజన్ ప్రారంభమైంది. బంగారం కొనేందుకు అంతా రెడీ అవుతున్నారు. గోల్డ్ షాపులు కస్టర్లతో కిటకిటలాడుతున్నాయి. మరి మీరు కూడా బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే మంచి సమయం. పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 10 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 10 తగ్గింది. నేడు హైదరాబాద్ లో తులం ఎంత ఉందంటే?
హైదరాబాద్ ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 7,744, 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,448 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నిన్న(ఆదివారం) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 77,450గా ఉంది. నేడు రూ. 10 తగ్గడంతో రూ. 77,440 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిన్న(ఆదివారం) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 84,490గా ఉంది. నేడు రూ. 10 తగ్గి రూ. 84,480 వద్ద అమ్ముడవుతోంది. విశాఖ పట్నం,విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,590 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 84,630 వద్దకు చేరింది.
బంగారంతో పోటీపడుతూ ధర పెరుగుతున్న వెండి కూడా నేటి ధరల్లో స్వల్ప మార్పులు కనిపించాయి. నేడు కిలో వెండి పై రూ. 100 తగ్గింది. హైదరాబాద్ లో నేటి వెండి ధర గ్రాము రూ. 106.90, కిలో రూ.1,6,900 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్ లో కిలో వెండిపై రూ. 100 తగ్గి రూ. 1,06,900 వద్ద అమ్ముడవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. హస్తినలో కిలో వెండిపై రూ. 100 తగ్గి రూ. 99,400 వద్ద ట్రేడ్ అవుతోంది.