దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ముగిశాయి. సోమవారం ఉదయం ఆరంభంలోనే సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ముగింపు వరకు అలానే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 36 పాయింట్లు నష్టపోయి 79, 960 దగ్గర ముగియగా.. నిఫ్టీ 3 పాయింట్లు నష్టపోయి 24, 320 దగ్గర ముగిసింది. డాలర్ పోలిస్తే రూపాయి మారకం విలువ 83.50 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Balcony Rent: అక్కడ బాల్కనీ అద్దె నెలకు రూ. 80,000..!
నిఫ్టీలో ఒఎన్‌జీసీ, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌యుఎల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్‌లు లాభపడగా.. దివీస్ ల్యాబ్స్, టైటాన్ కంపెనీ, బిపిసిఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ మరియు ఆయిల్ & గ్యాస్ 0.6-1.5 శాతం పెరగగా.. ఆటో, బ్యాంక్, హెల్త్‌కేర్, మెటల్, రియల్టీ, పవర్, టెలికాం 0.4-0.8 శాతం క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు స్వల్పంగా నష్టాల్లో ముగిశాయి.
ఇది కూడా చదవండి: Mumbai: పట్టాలపై జారిపడ్డ మహిళ పైనుంచి వెళ్లిన రైలు.. సురక్షితంగా బయటకు