దేవర సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇటీవల ఈ సినిమా 100 రోజుల థియేటర్ రన్ కూడా ఫినిష్ చేసుకుంది. ఆ సక్సెస్ జోష్ తోనే హృతిక్ రోషన్ తో కలిసి వార్ -2 లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల ముగించాడు యంగ్ టైగర్. ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నసంగతి తెలిసిందే.
Also Read : HoneyRose : ‘హానీరోజ్’పై లైంగిక వేధింపులకు పాల్పడిన ‘బిజినెస్ మెన్’
ఓ నెల క్రితం ఆ సినిమా పూజ కార్యక్రమాలు కూడా ముగించారు మేకర్స్. ఓపెనింగ్ రోజున ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్టు అధికారకంగా ప్రకటించేసారు మేకర్స్. తాజగా ఈ సినిమాకు సంబంధించి మరొక అప్ తెలుస్తోంది. ఈ సినిమాలో మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ తో పాటు మలయాళ లీడింగ్ యాక్టర్ బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారట. త్వరలోనే అందుకు సంబంధించి అధికారక ప్రకటన కూడా రానున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమాను ఈ నెల చివరి వారంలో షూట్ స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి నుండి ఎన్టీఆర్ ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టనున్నట్టు యూనిట్ సమాచారం. రవి బస్రూర్ సంగీతంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.