Puri Jagannath: ఎటూ తెగని డబుల్ ఇస్మార్ట్ పంచాయతీ..రంగంలోకి పూరి, ఛార్మి..
- పూరీనివెంటాడుతున్న లైగర్
- నేడు మరోసారి డబుల్ ఇస్మార్ట్ పంచాయతీ
- రంగంలోకి దిగిన ఛార్మి- పూరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ విడుదల కానున్న ఈ చిత్రంఫై అంచానాలు ఉన్నాయి. ఇటీవల విడుడల చేసిన రెండు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అటు లైగర్ తో పూరి జగన్నాధ్ డిజాస్టర్ ఇచ్చాడు , ఇటు స్కందతో ఫ్లాప్ కొట్టాడు రామ్. ఇద్దరు చెరొక భారీ ఫ్లాప్ తర్వాత వీరి కలయికలో రానున్న ఈ చిత్రంపై హీరో, దర్శకుడు చాలా నమ్మకంగా ఉన్నారు.
కాగా ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు గాను రూ.56 కోట్లకు కొనుగోలు చేసారు హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి. హిందీ రైట్స్ ను రూ.6 కోట్లకు కొనుగోలు చేసారు. కానీ ఈ సినిమా నైజాం విడుదల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. రైట్స్ కొనుగోలు చేసిన నిరంజన్ రెడ్డి మైత్రీ మూవీస్ ద్వారా రిలీజ్ చేయాలని చూడగా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను. నైజాం తనకు కాకుండా ఎవరికి ఇచ్చినా ఒప్పుకునేది లేదు అని భీష్మించుకూర్చున్నాడు. ఈ నేపథ్యంలో 20% కమిషన్ బేసిస్ వరంగల్ శ్రీను పంపిణి చేసేందుకు మాటలు జరిగాయి. అసలు లైగర్ నష్టాలు ఎంత అనేది లెక్క తేలని కారణంగా మొదటికి వచ్చింది వ్యవహారం. దీంతో లైగర్ నిర్మాతలయిన ఛార్మి, పూరి జగన్నాధ్ నేడు ముంబయి నుండి హైదరాబాద్ రానున్నారు. మరోసారి పూరి జగన్నాధ్, ఛార్మి, వరంగల్ శ్రీను, మైత్రీ మూవీస్ సమక్షంలో పంచాయతీ జరగనుంది. మరి విడుదలకు 14 రోజులు ఉండగా ఈ పంచాయతీలు ఏమిటో అని రామ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Also Read
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్డేట్ వైరల్!
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!