Swiggy: స్విగ్గీ బాదుడు షురూ.. ఫుడ్ ఆర్డర్‌పై ఛార్జ్.. తొలుత ఈ నగరాల్లోనే అమలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swiggy: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ బాదుడు షుచూ చేసింది. వినియోగదారుల నుంచి ఫుడ్ ఆర్డర్ పై రుసుము వసూలు చేస్తోంది. ఫుడ్ ఐటమ్స్ తో సంబంధం లేకుండా ‘‘ప్లాట్‌ఫారమ్’’ ఛార్జీల పేరుతో వినియోగదారుల నుంచి రూ. 2 చొప్పున వసూలు చేయడం ప్రారంభించింది. ఆర్డర్ పరిమాణాన్ని బట్టి ఛార్జీలు పెరగడం అనేది ఉండదు. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ వ్యాపారం మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. స్విగ్గితో పాటు జొమాటో కూడా ప్రభావితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకోవడం, ఖర్చును తగ్గించుకోవడం, పనితీరును మెరుగుపరుచుకోవడానికి స్విగ్గీ ప్లాట్‌ఫారమ్ ఛార్జీలను వసూలు చేస్తోంది.
Read Also: Jairam Ramesh: కర్ణాటకకు విటమిన్-పి కావాలి..
Also Read
- Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
- Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
- PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
ముందుగా బెంగళూర్, హైదరాబాద్ నగరాల్లో అదనపు ఛార్జీలను ప్రవేశపెట్టారు. అయితే ముంబై, ఢిల్లీ నగరాల్లో ఈ ఛార్జీలను తీసుకురాలేదు. స్విగ్గీ సీఈఓ, సహవ్యవస్థాపకుడు శ్రీహర్ష మెజేటీ మాట్లాడుతూ.. డెలివరీ వ్యాపారంలో మందగమనానికి ప్లాట్‌ఫారమ్ ఛార్జీలు విధించేందుకు కారణమయ్యాయని అన్నారు. నిజానికి ప్లాట్‌ఫారమ్ ఛార్జీ తక్కువగా కనిపిస్తున్నప్పటికీ స్విగ్గీ ప్రతీ రోజూ 1.5 మిలియన్ల ఆర్డర్లను అందచేస్తుంది. దీంతో స్విగ్గీకి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఏర్పడుతుంది. త్వరలోనే ఇతర ప్రాంతాలకు ఈ ఛార్జీలను విస్తరిస్తామని కంపెనీ చెబుతోంది.
ప్రస్తుతం స్విగ్గీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న జొమాటో కూడా మందగమనాన్ని ఎదుర్కొంటోంది. జొమాటో సీఈఓ అక్షంత్ గోయల్ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికి ఫలితాల్లో మందగమనాన్ని ఇటీవల ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా వ్యాపారంలో క్షీణత కనిపిస్తోందని, ముఖ్యంగా టాప్ -8 నగరాల్లో ఇది ఎక్కువగా ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జొమాటో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్లాట్‌ఫారమ్ ఫీజులను ప్రవేశపెట్టలేదు. ఆదాయాలతో పోలిస్తే.. జొమాటో వార్షిక ఆదాయం రూ.4,100 కోట్లుగా ఉంటే స్విగ్గీ ఆదాయం రూ. 5,700 కోట్లుగా ఉంది.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..