స్టాక్ మార్కెట్‌కు సరికొత్త జోష్ వచ్చింది. గురువారం మార్కెట్ ప్రారంభం కాగానే భారీ లాభాలతో ప్రారంభమైంది. సూచీలు గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. కొద్దిరోజులుగా ఒడిదుడుకులతో కొట్టుమిట్టాడుతున్న సూచీలు.. ఈరోజు సరికొత్త రికార్డ్ దిశగా దూసుకెళ్లాయి. నిఫ్టీ 26, 277 మార్కు చేరి ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది. 14 నెలల తర్వాత నిఫ్టీ ఈ కొత్త రికార్డ్‌ను సృష్టించింది.
ఇది కూడా చదవండి: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పాక్ రక్షణ మంత్రి కీలక ప్రకటన
ప్రస్తుతం సెన్సెక్స్ 275 పాయింట్లు లాభపడి 85, 884 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 26, 277 దగ్గర కొనసాగుతోంది. ఇక నిఫ్టీలో హిందాల్కో, ఎల్ అండ్ టీ, ఎన్‌టీపీసీ, జియో ఫైనాన్షియల్, బజాజ్ ఫైనాన్స్ ప్రధాన లాభాలను ఆర్జించగా.. టైటాన్ కంపెనీ, అపోలో హాస్పిటల్స్, మ్యాక్స్ హెల్త్‌కేర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా నష్టపోయాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు స్వల్పంగా పెరిగాయి.
ఇది కూడా చదవండి: US: వైట్‌హౌస్ దగ్గర కాల్పులు.. ఇద్దరు నేషనల్ గార్డ్స్‌కు సీరియస్!