పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. అలానే కొనసాగుతోంది. సెన్సెక్స్ ప్రారంభంలో 1,337 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 847 పాయింట్లు నష్టపోయి 80,848 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 253 పాయింట్లు నష్టపోయి 24, 634 దగ్గర కొనసాగుతోంది. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, ట్రెంట్ ప్రధానమైనవన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోడీ
మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, ఆటో, పీఎస్‌యు బ్యాంక్, ఐటి 1-1.5 శాతం తగ్గడంతో అన్ని రంగాల సూచీలు రెడ్‌లో ట్రేడవుతున్నాయి. అలాగే అదానీ పోర్ట్స్, ట్రెంట్, పవర్ గ్రిడ్ కార్ప్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నిఫ్టీలో ప్రధాన నష్టాల్లో ఉన్నాయి, భారత్ ఎలక్ట్రానిక్స్ మరియు ఒఎన్‌జిసి లాభపడ్డాయి.
ఓ వైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం.. ఇంకోవైపు అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోవడం.. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వెనుకంజ వేస్తున్నారు. దీంతో సూచీలు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: Netanyahu: ఇరాన్‌పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించాం.. ఇజ్రాయెల్ ప్రధాని వెల్లడి
శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. భారీ స్థాయిలో నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేసేందుకు సిద్ధపడుతోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.