మగువలకు గుడ్ న్యూస్… నేడు పసిడి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. క్రమంగా బంగారం ధర తగ్గుతూ రావడం కొనుగోలుదారులకు సంతోషించే విషయం. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వంద రూపాయలు పతనమైంది. గత నాలుగు రోజుల నుంచి వరుసగా తగ్గుతూ వస్తోంది బంగారం. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 44,000లకు దిగి వచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే రూ. 110 పతనమైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 110 తగ్గి రూ.48,000 లకు చేరుకుంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. ఈరోజు కేజీ వెండి ధర రూ. 500 తగ్గింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి రూ. 68,000 కు చేరుకుంది.