ఖాతాదారులకు ఎస్‌బీఐ హెచ్చరిక..! ఈ ఐదు మరవద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. ఈ సమయంలో ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోవడంతో… సైబర్ నేరగాలు కూడా చెలరేగిపోతున్నారు.. కొందరు కేటుగాళ్లు.. ఫోన్లు చేసి.. ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు, ఖాతా నెంబర్లు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు తెలుసుకుని.. ఖాతాల్లో ఉన్న సొమ్ము మొత్తం ఊడ్చేస్తున్నారు.. మరోవైపు.. ఏదో బ్యాంకు పేరుతో ఓ లింక్ పంపి.. ట్రాప్ చేస్తున్నారు.. లోక్ కావాలంటే… ఈ లింక్ క్లిక్ చేయండి.. ఈజీగా లోన్ పొందండి.. లాంటి మెసేజ్‌లు పెట్టి ఓ లింక్ అటాచ్ చేస్తున్నారు.. పొరపాటున ఆ లింక్ క్లిక్ చేస్తే.. ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తం మాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బ్యాంకులు కూడా జాగ్రత్తగా ఉండాలని తమ ఖాతాదారులుకు సూచిస్తున్నాయి. తాజాగా ఈ సైబర్ మోసల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వినియోగదారులను కోరింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ఎంచుకున్న వినియోగదారులు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి సూచించింది అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థ ఎస్బీఐ.
సోషల్ మీడియా వేదకగా.. తమ ఖాతాదారులన అలర్ట్ చేసింది ఎస్బీఐ.. విలువైన సమాచారాన్ని ఎవరితో పంచుకోవద్దని కోరింది.. మా ఖాతాదారులకు గమనిక మోసగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండండి, ఆన్‌లైన్‌లో ఎటువంటి సున్నితమైన వివరాలను పంచుకోవద్దు, తెలియని వారు చెబితే ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవద్దు అని సలహా ఇచ్చింది.. ఇక, ముఖ్యంగా ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దంటూ.. ఐదు పాయింట్స్ సూచించింది.. అందులో.. పుట్టిన తేదీ డెబిట్ కార్డ్ నెంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్, డెబిట్ కార్డు పిన్, సీవీవీ, ఓటీపీ వంటి వివరాలను షేర్ చేసుకోవద్దు అని సలహా ఇచ్చింది.. ఇక, ఎస్‌బీఐ, ఆర్‌బీఐ, ప్రభుత్వ కార్యాలయలు, పోలీసు, కెవైసి అథారిటీ పేరుతో కాల్ చేస్తున్న మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని కోరింది.. మరోవైపు.. ప్లే స్టోర్ కాకుండా, టెలిఫోన్ కాల్స్ లేదా ఈ-మెయిల్ ఆధారంగా ఏ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని హెచ్చరించింది. అలాగే, తెలియని మూలాల నుంచి వచ్చిన మెయిల్స్‌లోని అటాచ్‌మెంట్‌లపై క్లిక్ చేయవద్దని పేర్కొంది. అలాగే, ఈ-మెయిల్ లు, ఎస్ఎంఎస్, ఇతర సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆకర్షణీయమైన, అపరిచిత ఆఫర్లకు స్పందించవద్దని తన ఖాతాదారులకు సూచించింది ఎస్బీఐ.
Also Read
- 50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
- Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
- US LPG Supplier to India: భారత్‌కు 67% LPG అమెరికా నుంచే.. అతిపెద్ద సరఫరాదారుగా యూఎస్
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
తాజావార్తలు
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్‌కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
-
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!