స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు మోసపూరిత సందేశాలను ఎస్‌బీఐ ఖాతాదారులకు పంపిస్తున్నట్లు తెలిసింది. ఎస్‌బీఐ రివార్డును రీడీమ్ చేసుకోవడానికి యాప్ డౌన్‌లోడ్ చేయమని కొందరు మోసపూరిత మెసేజ్‌లను పంపిస్తున్నారు.
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బిఐ తమ కస్టమర్లకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది.. బ్యాంకింగ్ సేవలను మరింత ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బ్యాంక్ బ్రాంచుల సంఖ్యను మరింత విస్తరించాలని ఎస్‌బీఐ భావిస్తోంది. అంటే ఎస్‌బీఐ బ్రాంచుల సంఖ్య రానున్న కాలంలో ఇంకా పెరగనున్నాయని తెలుస్తుంది… ప్రస్తుతం ఉన్న బ్యాంకుల కన్నా ఎక్కువ బ్రాంచ్ లను స్టార్ట్ చెయ్యాలని అధికారులు భావిస్తున్నట్లు…
SBI: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది.. ‘అమృత్ కలాష్’ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని పొడిగించింది. ఎస్బీఐ వెబ్‌సైట్ ప్రకారం, ఈ 400 రోజుల టర్మ్ డిపాజిట్ సాధారణ కస్టమర్‌లకు 7.1 శాతం మరియు సీనియర్ సిటిజన్‌లకు 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ 400 రోజుల స్పెషల్ డిపాజిట్ పథకమైన అమృత్ కలాష్ డిపాజిట్ పథకం గడువు ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల…
క్రెడిట్ కార్డుపై నెల నెలా ఇంటి అద్దె చెల్లించేవారు కొంతమంది అయితే.. ఇంటి అద్దె పేరుతో తమ క్రెడిట్ కార్డులోని మొత్తాన్ని మరో ఖాతాకు బదలాయించి వాడుకునేవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారట. బయట అప్పులు తీసుకోవడం కంటే.. క్రెడిట్ కార్డుపై చెల్లించే వడ్డీ రేటు కాస్త తక్కువగానే ఉండడంతో.. చాలా మంది వివిధ యాప్‌ల నుంచి నెలా నెలా.. కార్డుపై లిమిట్ ఉన్నకాడికి లాగేస్తున్నారట.. అయితే, ఇప్పుడు వారికి జేబుకు చిల్లు తప్పని పరిస్థితి.. ఎందుకంటే..…
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)… తన ఖాతాదారులకు కీలక సమాచారాన్ని చేరవేసింది… డిజిటల్ లావాదేవీలకే ఎక్కువగా మొగ్గుచూపుతోన్న తరుణంలో.. తాత్కాలికంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్ సేవలు నిలిచిపోయాయని సూచించింది.. వార్షిక ఆర్థిక కార్యకలాపాల ముగింపు సందర్భంగా.. ఈ రోజు (ఏప్రిల్ 1 శుక్రవారం) మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో ఆధారిత సేవలు అందుబాటులో ఉండవని…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు క్రెడిట్ కార్డు ఈఎంఐలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ.99 ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా అన్ని మర్చంట్ అవుట్‌లెట్లు, ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, యాప్‌లలో జరిపే ఈఎంఐ లవాదేవీలకు ఈ ఫీజు వర్తిస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. ఎస్బీఐ…
ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. ఈ సమయంలో ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోవడంతో… సైబర్ నేరగాలు కూడా చెలరేగిపోతున్నారు.. కొందరు కేటుగాళ్లు.. ఫోన్లు చేసి.. ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు, ఖాతా నెంబర్లు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు తెలుసుకుని.. ఖాతాల్లో ఉన్న సొమ్ము మొత్తం ఊడ్చేస్తున్నారు.. మరోవైపు.. ఏదో బ్యాంకు పేరుతో ఓ లింక్ పంపి.. ట్రాప్ చేస్తున్నారు.. లోక్ కావాలంటే… ఈ లింక్ క్లిక్ చేయండి.. ఈజీగా లోన్ పొందండి.. లాంటి మెసేజ్‌లు పెట్టి ఓ లింక్ అటాచ్ చేస్తున్నారు..…