JioCinema: ఐపీఎల్ హక్కలను సొంతం చేసుకున్న తర్వాత జియో సినిమా చాలా మందికి దగ్గరైంది. అయితే ఇప్పుడు జియో సినిమాను అతిపెద్ద స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ గా మార్చేందుకు రిలయన్స్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 100కు పైగా సినిమాలు, టీవీ సిరీస్ లను తన జియో సినిమా యాప్ లోకి తీసుకురావాలని అనుకుంటోంది.