Home Loans: ఆర్బీఐ గుడ్‌న్యూస్ .. హోమ్‌లోన్ ఫిక్స్డ్ వడ్డీ రేట్లను మార్చుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Loans: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) హోమ్ లోన్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారి హోమ్‌లోన్ ఫిక్స్డ్ వడ్డీ రేట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఉన్న ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల విధానం నుంచి ఫిక్స్డ్ వడ్డీ రేట్ల విధానానికి మారే అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించి ఓ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొస్తామని ఆర్బీఐ ప్రకటించింది. ఇది కేవలం హోమ్‌లోన్ కస్టమర్లే కాకుండా వాహన, ఇతర రుణాలు తీసుకున్న వారూ ఈ విధానం కింద అధిక వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం పొందే వీలుంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
Read also: No Confidence Motion: కాంగ్రెస్‌పై భారత్‌కు అవిశ్వాసం ఉంది.. ప్రధాని మోడీ ఫైర్
Also Read
- EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీకి కేంద్రం ఆమోదం.. ఎంత శాతం? జమ ఎప్పుడంటే..?
- US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక డీల్.. సామాన్యుడికి కలిగే 5 భారీ లాభాలు ఇవే!
- Best Investment Plans: పిల్లల భవిష్యత్తు కోసం.. అద్భుతమైన పెట్టుబడి మార్గాలు.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిందే
- Tata Motors: ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన టాటా మోటార్స్.. ఒకే రోజులో లక్షల కోట్లు లాస్! ఎందుకో తెలుసా?
మూడు రోజులపాటు పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశాలు జరిగిన అనంతరం ఆర్బీఐ గవర్నర్ గురువారం మీడియాతో మాట్లాడారు. సాధారణంగా వడ్డీ రేట్ల పెరిగినప్పుడు రెగ్యులేటెడ్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈఎంఐలో ఎలాంటి మార్పులూ చేయకుండా కాలవ్యవధిని సవరిస్తుంటాయి. ఈ విషయంలో రుణ గ్రహీతకు ఎలాంటి సమాచారం ఇవ్వవు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇదే విషయాన్ని తాము చేపట్టిన అభిప్రాయ సేకరణలో వెల్లడించారని చెప్పారు. ఫ్లోటింగ్ వడ్డీ విధానంలో బ్యాంకులు తమ వద్ద నుంచి ఎలాంటి సమ్మతి లేకుండానే నిర్ణయం తీసుకుంటున్నాయని వారు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇందుకు పరిష్కారంగా ఆయా ఆర్థిక సంస్థలు అమలు చేసే విధంగా ఓ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురాబోతున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. కొత్త ఫ్రేమ్ వర్క్ ప్రకారం రుణ కాలాన్ని, ఈఎంఐలో మార్పులు చేసేటప్పుడు సంబంధిత సమాచారాన్ని రుణ గ్రహీతలకు తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల విధానం నుంచి ఫిక్స్డ్ విధానానికి మారేందుకు అవకాశం ఇవ్వడం లేదా ముందస్తు చెల్లింపులకు రుణ గ్రహీతకు అనుమతించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ఆప్షన్ల అమలుకు సంబంధించి వివిధ ఛార్జీల విషయంలో పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు రుణ గ్రహీతకు ఆయా ఛార్జీల వివరాలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుందని శక్తికాంత దాస్ చెప్పారు.
తాజావార్తలు
-
Hormuz: 3 నెలల తర్వాత సాఫీగా వాణిజ్య నౌకలు ప్రయాణం.. ఫొటోలు వైరల్
-
Wife Kills Husband: ఇన్‌స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
-
EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీకి కేంద్రం ఆమోదం.. ఎంత శాతం? జమ ఎప్పుడంటే..?
-
Pakistan Cricket Board: పాక్ క్రికెటర్లకు పీసీబీ బంపర్ ఆఫర్.. జీతాలు, మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు..
-
Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో మాకు సంబంధం లేదు.. దక్షిణ లెబనాన్‌పై చర్యలు కొనసాగుతాయన్న ఇజ్రాయెల్
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..