Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fact Check: ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ20 (E20) పెట్రోల్‌కు సంబంధించిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇథనాల్ కలిపిన ఈ పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఫ్యూయల్ క్యాప్ (పెట్రోల్ ట్యాంక్ మూత) చుట్టూ చీమలు చేరుతున్నాయనేది ఆ వీడియో సారాంశం. చూస్తుండగానే ఈ వార్త వేల మందికి చేరడంతో వాహనదారుల్లో లేనిపోని అనుమానాలు, ఆందోళనలు మొదలయ్యాయి. అసలు ఈ20 పెట్రోల్‌లో చీమలను ఆకర్షించే గుణం నిజంగానే ఉందా? లేక ఇదొక పుకారా? అనే విషయంపై తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) శాస్త్రీయ ఆధారాలతో క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది.
అసలు వివాదం ఏంటి?
ఇటీవల ‘E100’ ఇంధనానికి చట్టపరమైన అనుమతులు లభించిన తర్వాత, సోషల్ మీడియాలో ఇథనాల్ బ్లెండింగ్‌పై రకరకాల పోస్ట్‌లు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఒక వీడియో వైరల్‌గా మారింది. ఇథనాల్‌ను చెరకు నుంచి తయారు చేస్తారు కాబట్టి, ఆ తీపి వాసనకు కార్ల ఫ్యూయల్ క్యాప్స్ వద్ద చీమలు గుంపులుగా చేరుతున్నాయని కొందరు బలంగా నమ్మారు. ఈ ప్రచారంపై స్పందించిన బీపీసీఎల్ (BPCL).. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని స్పష్టం చేసింది. పెట్రోల్‌లో కలిపే ‘ఫ్యూయల్-గ్రేడ్ ఇథనాల్’ను ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా తయారు చేస్తారని కంపెనీ వివరించింది. ఫెర్మెంటేషన్ (పులియబెట్టడం), డిస్టిలేషన్ సాంకేతికత ద్వారా దీనిని తయారు చేయడం వల్ల చివరిగా వచ్చే ఇంధనంలో ఎలాంటి షుగర్ అవశేషాలు మిగలవు. అంతేకాకుండా, ఈ ఫ్యూయల్ ఇథనాల్‌లో ‘డిన్యాచురెంట్స్’ అనే రసాయనాలను కలుపుతారు. ఇవి కీటకాలు, పురుగులను దరిచేరనివ్వకుండా దూరంగా ఉంచుతాయి. కాబట్టి చీమలను ఆకర్షించే గుణాలేవీ ఇందులో ఉండవు. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపినప్పటికీ, దాని నుంచి వచ్చే సాధారణ హైడ్రోకార్బన్ వాసనే ఎక్కువగా ఉంటుంది. చీమలను ఆకర్షించేంత ప్రత్యేకమైన వాసన ఇథనాల్‌కు ఉండదని బీపీసీఎల్ పేర్కొంది.అంతేకాదు.. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ కలిపిన పెట్రోల్‌లో ఫ్యూయల్ వేపర్ (ఇంధన ఆవిరి) చాలా తక్కువగా వస్తుందని కంపెనీ తెలిపింది. కాబట్టి ఇంధనం లీకై లేదా ఆవిరై చీమలు వచ్చే అవకాశమే లేదు. ఈ20 పెట్రోల్‌కు, చీమలు రావడానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పిన బీపీసీఎల్.. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి నిరాధారమైన పుకార్లను నమ్మవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేసింది.
Also Read
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
- Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
- Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
BPCL has examined the claims circulating on social media regarding ants congregating around vehicle fuel filler caps and their alleged association with E20 petrol.
Fuel-grade ethanol used for petrol blending is produced through fermentation and distillation processes that… pic.twitter.com/1qED7xBBhe
— Bharat Petroleum (@BPCLimited) June 17, 2026
తాజావార్తలు
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?