Hormuz: 3 నెలల తర్వాత సాఫీగా వాణిజ్య నౌకలు ప్రయాణం.. ఫొటోలు వైరల్
- ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం
- పశ్చిమాసియాలో తగ్గిన ఉద్రిక్తతలు
- 3 నెలల తర్వాత సాఫీగా వాణిజ్య నౌకలు ప్రయాణం
- హార్ముజ్ ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమ్మయ్య.. 3 నెలల తర్వాత హార్ముజ్ జలసంధి నుంచి వాణిజ్య నౌకలు సాఫీగా ప్రయాణం చేస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా యథావిధిగా పుంజుకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. దీంతో ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా హార్ము్జ్ గుండా ఓడలు ప్రయాణాలు సాఫీగా సాగిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. అయితే లెబనాన్‌కు సంబంధించిన సంక్షోభం మాత్రం ఇంకా వీడలేదు.
ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం తర్వాత గల్ఫ్ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గురువారం సుమారు 6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును తీసుకువెళ్తున్న సౌదీ జెండా గల మూడు పెద్ద చమురు ట్యాంకర్లు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాయి. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన కొద్దిసేపటికే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ ఒప్పందం తర్వాత హార్ముజ్ జలసంధిలో ఉపశమనం కలిగించే చిత్రాలు వెలువడ్డాయి. అక్కడ ఇప్పుడు చమురు ట్యాంకర్లు, ఓడల రాకపోకలు సజావుగా సాగుతున్నాయి.
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం-ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నిర్ణీత గడువు కంటే రెండు రోజుల ముందుగానే ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధిని తక్షణమే తిరిగి తెరవడం.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం జరిగింది.
అయితే లెబనాన్ నుంచి మాత్రం తమ సైన్యాన్ని ఉపసంహరించుకునే ఉద్దేశం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. గురువారం ఇజ్రాయెల్.. దక్షిణ లెబనాన్‌లోని మరిన్ని ప్రాంతాలను తన నియంత్రణలో ఉన్న బఫర్ జోన్‌గా చూపిస్తూ ఒక కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉంచేందుకు అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని ఇద్దరు ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. నెతన్యాహుకు సన్నిహితంగా ఉండే ఒక సీనియర్ అధికారి ఈ చర్చలను ‘కష్టమైనవి, మొండివి’గా అభివర్ణించారు. ఇజ్రాయెల్ వెనక్కి తగ్గబోదని అన్నారు.
గురువారం దక్షిణ లెబనాన్ పట్టణాలైన కఫ్రాత్బానిట్, జెబ్దీన్లపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు మరణించారని.. అలాగే రాజధాని బీరుట్, దాని దక్షిణ శివారు ప్రాంతాలలో కూడా ఇజ్రాయెల్ డ్రోన్ కార్యకలాపాలు కనిపించాయని లెబనాన్ ప్రభుత్వ వార్తా సంస్థ నివేదించింది.
وضعیت «تنگه هرمز» بعد از امضای تفاهمنامهhttps://t.co/ehxfM0L9CL pic.twitter.com/kZFXaAcTwG
— خبرگزاری ایسنا (@isna_farsi) June 18, 2026
- Tags
- Hormuz
- Iran
- Peace Deal
- us
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!