Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
- ఆస్ట్రేలియా మహిళల క్రికెట్లో మరో కొత్త తార
- భారత సంతతికి చెందిన యువ ఆల్‌రౌండర్ ఇరా
- ప్రతిభతో పాటు మైమరిపించే అందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ira Aery Australia Cricketer: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్లో మరో కొత్త తార దూసుకొస్తోంది. భారత సంతతికి చెందిన యువ ఆల్‌రౌండర్ ‘ఇరా ఏరీ’.. తన ప్రతిభతో పాటు మైమరిపించే అందంతో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఆస్ట్రేలియా అండర్-19 మహిళల జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగిన ఇరా.. భవిష్యత్తు స్టార్‌గా గుర్తింపు పొందుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇరా పేరు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Also Read
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
భారత సంతతి అమ్మాయి:
2009 ఫిబ్రవరి 25న విక్టోరియాలోని హైడల్‌బర్గ్‌లో జన్మించిన ఇరా ఏరీ.. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయ కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న ఆమె.. స్థానిక క్లబ్‌లలో ఆడుతూ తన ప్రతిభను నిరూపించుకుంది. పాఠశాల స్థాయి టోర్నమెంట్లలోనూ అద్భుత ప్రదర్శన కనబరిచి కోచ్‌ల ప్రశంసలు అందుకుంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా వెస్ట్రన్ రీజియన్ జూనియర్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఆమె క్రికెట్ ప్రయాణం ప్రారంభమైంది. క్రమశిక్షణ, ఫిట్నెస్, ఆటపై అంకితభావంతో అంచెలంచెలుగా ఎదిగిన ఇరా.. త్వరలోనే రాష్ట్ర స్థాయి జట్లలో స్థానం సంపాదించింది. ఆ తరువాత ఆస్ట్రేలియా మహిళల అండర్-19 జట్టుకు ఎంపికై తన కెరీర్లో కీలక మైలురాయిని అందుకుంది.

ముక్కోణపు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన:
ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్-శ్రీలంక మహిళల అండర్-19 ముక్కోణపు సిరీస్‌లో ఇరా ఏరీ అద్భుత ప్రదర్శన చేసింది. మొత్తం 13 వికెట్లు పడగొట్టి టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఆమె బౌలింగ్‌లోని స్థిరత్వం, ఒత్తిడి పరిస్థితుల్లోనూ వికెట్లు తీయగల సామర్థ్యం సెలెక్టర్లను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జాతీయ సెలక్టర్లు ఇరా ఆటను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే జోరు కొనసాగిస్తే త్వరలోనే ఆస్ట్రేలియా సీనియర్ మహిళల జాతీయ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్‌రౌండర్‌గా జట్టుకు ఉపయోగపడే లక్షణాలు ఆమెకు ఉండటం పెద్ద ప్లస్ పాయింట్‌గా భావిస్తున్నారు.

సరికొత్త క్రికెట్ క్రష్:
సోషల్ మీడియాలో ఇరా ఏరీ పేరు మార్మోగుతోంది. ఆమె అందం, ఫిట్నెస్, ఆటతీరు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కొంతమంది అభిమానులు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఎల్లీస్ పెర్రీతో పోలుస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇరా తన ప్రతిభతోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. యువ వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఇరా.. భవిష్యత్తులో ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌కు కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత సంతతికి చెందిన ఈ యువ క్రికెటర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సరికొత్త క్రష్ అయిపొయింది.

తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!