5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
- మనీ ప్లాంట్, లక్కీ బాంబూ.. నీటిలోనే సులభంగా పెరిగే మొక్కలు
- స్పైడర్ ప్లాంట్, పోథోస్తో ఇంటికి నేచురల్ లుక్
- సింగోనియం సహా తక్కువ సంరక్షణతో పెరిగే ఇండోర్ ప్లాంట్స్
- హైడ్రోపోనిక్స్తో మట్టి లేకుండానే గ్రీన్ హోమ్ సొంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5 Best Indoor Plants : ఈ రోజుల్లో ఇంట్లో మొక్కలు పెంచడం ఒక పెద్ద ట్రెండ్‌గా మారింది. ఇది ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, గాలిని శుద్ధి చేస్తుంది , మానసిక ఒత్తిడిని తగ్గించి మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ముఖ్యంగా నేటి యువతరం మట్టితో పని లేకుండా, కేవలం శుభ్రమైన నీటిని ఉపయోగించి మొక్కలను పెంచడానికి తెగ ఇష్టపడుతున్నారు. ఈ మోడ్రన్ పద్ధతినే ‘హైడ్రోపోనిక్స్’ అంటారు. మట్టి లేకపోవడం వల్ల ఇల్లు అస్సలు మురికి అవ్వదు, పైగా ఇంటికి ఒక లగ్జరీ లుక్ వస్తుంది. మరి నీటిలోనే చాలా సులభంగా పెరిగే ఆ మొక్కలేంటో ఇప్పుడు చూద్దాం.
1. మనీ ప్లాంట్ (Money Plant)
ఇంటికి అదృష్టాన్ని, సంపదను తెస్తుందని నమ్మే మనీ ప్లాంట్ అందరి ఇళ్లలో కామన్ గా కనిపిస్తుంది. దీనికి అస్సలు మట్టి అవసరం లేదు. ఒక పారదర్శక గాజు సీసా, ప్లాస్టిక్ జార్లో నీళ్లు పోసి ఇందులో ఉంచితే చాలు, చాలా వేగంగా పెరుగుతుంది. అయితే ఈ మొక్కపై నేరుగా ఎండ పడకూడదు. కిటికీ పక్కన ఉంచితే వచ్చే వెలుతురు దీనికి సరిపోతుంది. మనీ ప్లాంట్ నీటిలోనే అద్భుతంగా పెరుగుతుందని సైంటిఫిక్ రీసెర్చ్ కూడా చెబుతోంది.
Also Read
- CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
2. లక్కీ బాంబూ (Lucky Bamboo)
వాస్తు , ఫెంగ్ షుయ్ ప్రకారం లక్కీ బాంబూను ఇంట్లో ఉంచుకోవడం చాలా అదృష్టం. ఒక అందమైన గాజు గిన్నెలో నీళ్లు పోసి, కొన్ని కలర్ రాళ్లు (స్టోన్స్) వేసి ఈ మొక్కను పెంచుకోవచ్చు. దీనికి అస్సలు ఎండ అవసరం లేదు. అందుకే దీనిని లివింగ్ రూమ్‌లో సెంటర్ టేబుల్ పైన లేదా ఆఫీస్ డెస్క్‌పై పెట్టుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది కూడా పూర్తిగా నీటిలోనే పెరిగే హైడ్రోపోనిక్ మొక్క.
3. స్పైడర్ ప్లాంట్ (Spider Plant)
రిబ్బన్ లాంటి అందమైన ఆకులతో ఉండే స్పైడర్ ప్లాంట్ ఇళ్లకు మంచి లుక్ ఇస్తుంది. ఈ మొక్కకు వచ్చే చిన్న చిన్న పిలకలను (లేత మొక్కలను) కత్తిరించి నీటిలో ఉంచితే చాలా వేగంగా వేర్లు వస్తాయి. కాకపోతే, మొక్క అడుగు భాగం మాత్రమే నీటిలో మునిగేలా చూసుకోవాలి , వారానికి ఒకసారి నీటిని మారుస్తూ ఉండాలి. ఇంటి లోపల ఉండే చెడు గాలిని శుద్ధి చేయడంలో ఈ మొక్క నెంబర్ వన్ అని చెప్పొచ్చు.
4. పోథోస్ (Pothos)
ఇది చూడటానికి ఫిలోడెండ్రాన్ మొక్క లాగే, గుండె ఆకారంలో ఉండే ఆకుపచ్చ లేదా పసుపు మచ్చల ఆకులతో భలే ముద్దగా ఉంటుంది. దీని కాండాలను కత్తిరించి నీటిలో వేస్తే చాలా ఈజీగా వేర్లు వచ్చేస్తాయి. ఈ తీగలు చాలా ఫాస్ట్‌గా ఎదుగుతాయి. ఎలాంటి వాతావరణాన్నైనా, తక్కువ కాంతినైనా తట్టుకుని బతకడం దీని స్పెషాలిటీ. కానీ డైరెక్ట్ ఎండలో పెడితే మాత్రం ఆకులు మాడిపోతాయి.
5. సింగోనియం, ఆరోహెడ్ (Syngonium)
బాణం ఆకారంలో ఉండే దీని ఆకులు చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ఇంటి లోపల డెకరేషన్ కోసం ఈ మొక్కను ఎక్కువగా వాడుతుంటారు. రూమ్‌లో లైటింగ్ తక్కువగా ఉన్నా కూడా ఇది నీటిలోనే హ్యాపీగా పెరుగుతుంది. దీని అందమైన తీగలు మీ హాల్, బాల్కనీ లుక్‌ను పూర్తిగా మార్చేస్తాయి.
కాబట్టి, మట్టితో ఇల్లు పాడవుతుందనే టెన్షన్ లేకుండా ఈ మొక్కలను తెచ్చి ఒక మంచి గాజు సీసాలో నీళ్లు పోసి ఇప్పుడే మీ ఇంటిని డెకరేట్ చేసుకోండి..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!