Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం పేద మహిళల కోసం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకం “ప్రధాని మంత్రి ఉజ్వల యోజన” (PMUY) లబ్ధిదారులకు గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో.. ప్రభుత్వం తన రాయితీ భారానికి కత్తెర వేసింది. ఇప్పటివరకు ఈ పథకం కింద ఏడాదికి అందుతున్న 9 సబ్సిడీ సిలిండర్ల పరిమితిని ఏకంగా 4 కి తగ్గించేసింది. అంటే.. ఐదో సిలిండర్ కొనాలంటే ఇకపై సామాన్యుడు మార్కెట్ రేటు చెల్లించాల్సిందే.
ట్విస్ట్ ఏమిటంటే.. ఉజ్వల యోజన లబ్ధిదారులు సాధారణంగా ఏడాదికి నాలుగైదు సిలిండర్లు మాత్రమే వాడుతుంటారని, కాబట్టి ఈ తగ్గింపు వారిపై పెద్దగా ప్రభావం చూపదని ప్రభుత్వ అధికారులు సమర్థించుకుంటున్నారు. కానీ.. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.. గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం వల్లే పేద కుటుంబాలు సిలిండర్లను రీఫిల్ చేసుకోలేక, మళ్లీ పాత పద్ధతిలో కట్టెల పొయ్యిల వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రభుత్వం ఏటా వాడకం సగటు 4-5 మాత్రమే ఉందని లెక్కలు చెప్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం ధరల భయంతోనే వాడకం తగ్గిందనేది పచ్చి నిజం.
Also Read
- CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
- ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
- SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
- Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్‌లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
ప్రస్తుతం ఢిల్లీలో ఉజ్వల వినియోగదారులు రూ.642 చెల్లిస్తుండగా, సాధారణ వినియోగదారులు రూ.942 చెల్లిస్తున్నారు. అయితే… అంతర్జాతీయంగా ‘సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్’ ఫిబ్రవరి నుండి 46 శాతం పెరగడంతో, ఒక సిలిండర్ సరఫరా ఖర్చు ప్రభుత్వానికి రూ.1600 దాటుతోంది. దీనివల్ల చమురు సంస్థలు ప్రతి సిలిండర్‌పై రూ.700 నష్టపోతున్నాయి. ఈ నష్టాలను తట్టుకోవడానికే లబ్ధిదారులకు ఏడాదికి కేవలం మొదటి 4 సిలిండర్లపై మాత్రమే రూ.300 చొప్పున (మొత్తం రూ.1200) రాయితీ ఇవ్వాలని చమురు మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మొత్తానికి, అంతర్జాతీయ చమురు సెగలు.. దేశంలోని పేదవాడి వంటగదిని చల్లబరుస్తున్నాయి. రాయితీలు తగ్గించి బడ్జెట్ బ్యాలెన్స్ చేస్తున్నామంటున్న ప్రభుత్వం, పేదవాడి బడ్జెట్ తలకిందులవుతోందన్న నిజాన్ని విస్మరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
-
Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
-
Jaya Bachchan: జాన్వీని ఒక వస్తువులా చూసినట్లున్నారు.. పెద్ది దర్శకుడిపై జయా బచ్చన్ విమర్శలు
-
Buchi Babu: నేను ఎలా నమ్మానో చరణ్ కూడా అలాగే నమ్మాడు.. ‘పెద్ది’ క్లైమాక్స్‌పై బుచ్చిబాబు ఎమోషనల్!
-
Viral: లైకుల కోసం యూట్యూబ్‌లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!