24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
24 Carat Gold: బంగారం కొనుగోలు చేయడానికి వెళ్లినప్పుడు 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు వంటి పదాలు తరచూ వినిపిస్తాయి. అయితే బంగారం స్వచ్ఛతను 24 క్యారెట్లలోనే ఎందుకు కొలుస్తారు? 50 క్యారెట్లు లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? అనే సందేహం చాలామందికి వస్తుంది. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే వేల ఏళ్ల చరిత్రలోకి వెళ్లాల్సిందే.
ఒక చిన్న గింజతో ప్రారంభమైన చరిత్ర
నేటిలా డిజిటల్ త్రాసులు, ఖచ్చితమైన కొలత పరికరాలు లేని కాలంలో వ్యాపారులు బంగారం, వజ్రాలు వంటి విలువైన వస్తువులను తూచేందుకు సహజమైన ప్రమాణాన్ని ఉపయోగించేవారు. మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లో విరివిగా పెరిగే కారోబ్ చెట్టు గింజలు దాదాపు ఒకే బరువు ఉండేవి. ఒక్కో గింజ సుమారు 0.18 నుంచి 0.20 గ్రాముల బరువు ఉండటంతో వాటినే తూకం ప్రమాణంగా ఉపయోగించడం ప్రారంభించారు.
Also Read
- 14K vs 18K vs 22K Gold: బంగారం స్వచ్ఛత ఎంత? 14K, 18K, 22K మధ్య తేడాలు ఇవే..
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
‘క్యారెట్’ అనే పదం ఎలా వచ్చింది?
కారోబ్ గింజ పేరు కాలక్రమేణా వివిధ భాషల్లో మారుతూ వచ్చింది. గ్రీకు భాషలో దీనిని ‘కెరాసియన్’, అరబిక్‌లో ‘ఖిరాత్’, ఇటాలియన్లో ‘కరాటో’ అని పిలిచేవారు. చివరకు ఆంగ్లంలో అది ‘క్యారెట్ (Carat)’గా మారింది. ప్రస్తుతం బంగారం స్వచ్ఛతను సూచించే క్యారెట్ అనే పదానికి ఇదే మూలం.
24 క్యారెట్ల విధానం ఎలా ప్రారంభమైంది?
24 క్యారెట్ల విధానం రోమన్ సామ్రాజ్య కాలంలో ప్రారంభమైంది. క్రీ.శ. 309లో రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ ప్రవేశపెట్టిన ‘సాలిడస్’ అనే బంగారు నాణెనాన్ని 24 సమాన భాగాలుగా విభజించేవారు. ఒక్కో భాగాన్ని ‘సిలిక్వా’ అని పిలిచేవారు. ప్రతి సిలిక్వా దాదాపు ఒక కారోబ్ గింజ బరువుతో సమానంగా ఉండేది. ఈ విధానంతో బంగారం స్వచ్ఛతను కొలవడం ప్రారంభమైంది. ఒక వస్తువులోని మొత్తం 24 భాగాలు బంగారమే ఉంటే దానిని 24 క్యారెట్లు అని పిలిచేవారు. 24లో 22 భాగాలు బంగారం ఉంటే అది 22 క్యారెట్లు, 18 భాగాలు ఉంటే 18 క్యారెట్లుగా పరిగణించేవారు.
24K, 22K, 18K అంటే ఏమిటి?
* 24 క్యారెట్లు (24K) – 99.9% స్వచ్ఛమైన బంగారం
* 22 క్యారెట్లు (22K) – 91.6% బంగారం
* 18 క్యారెట్లు (18K) – 75% బంగారం
* 14 క్యారెట్లు (14K) – 58.5% బంగారం
* 9 క్యారెట్లు (9K) – 37.5% బంగారం
క్యారెట్ సంఖ్య తగ్గే కొద్దీ రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాల శాతం పెరుగుతుంది. అందుకే నగల తయారీలో ఎక్కువగా 22K లేదా 18K బంగారాన్ని ఉపయోగిస్తారు. స్వచ్ఛమైన 24K బంగారం చాలా మెత్తగా ఉండటం వల్ల దానితో ఆభరణాలు తయారు చేయడం కష్టమవుతుంది.
వేల ఏళ్లైనా మారని ప్రమాణం
సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందినా, బంగారం స్వచ్ఛతను కొలిచే 24 క్యారెట్ల ప్రమాణం మాత్రం మారలేదు. వేల సంవత్సరాల క్రితం ఒక చిన్న కారోబ్ గింజతో ప్రారంభమైన ఈ విధానం నేటికీ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. అందుకే మీరు నగల దుకాణంలో 24K, 22K లేదా 18K అని చూసినప్పుడు, అది కేవలం బంగారం స్వచ్ఛతను సూచించే సంఖ్య మాత్రమే కాదు, దాదాపు మూడు వేల సంవత్సరాల చరిత్రను ప్రతిబింబించే అంతర్జాతీయ ప్రమాణమని గుర్తుంచుకోవాలి.
తాజావార్తలు
-
Harish Rao : రేవంత్ సర్కార్‌కు నీళ్లు తీసుకునే తెలివి లేదు..
-
Prabhas – Trivikram: ప్రభాస్‌తో సినిమాపై త్రివిక్రమ్ హింట్.. ఆ కాంబో సెట్ అయితే థియేటర్లలో రచ్చే!
-
Tamil Cinema: తెలుగు, కన్నడ దాటేశాయి.. తమిళ సినిమా ఎక్కడ వెనకబడింది?
-
AP Local Body Elections: నామినేషన్ల నుంచి ఏకగ్రీవాల వరకు వివాదాలు.. ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు
-
IPL 2027: నవంబరు 15లోగా రిటైన్ లిస్ట్ ఇవ్వాలి.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్..
ట్రెండింగ్
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!