ప్రస్తుతం ఆన్ లైన్ పేమెంట్స్ ను ఎక్కువగా చేస్తున్నారు.. అందులో పేటీఎం ను ఎక్కువగా వాడుతున్నారు..స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్స్ యాప్ లను వాడుతున్నారు..కరోనా మహమ్మారి తర్వాత క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్‌ల అవసరం పెరిగింది. ఈ క్రమంలో పేమెంట్ యాప్స్ పాపులర్ అయ్యాయి.. ఈ క్రమంలో పేటీఎం కస్టమర్స్ ను ఆకర్శించించేందుకు ఎప్పటికప్పుడు కొత్త యాప్ లను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. తాజాగా యూజర్స్ కోసం మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది..
పేటీఎం యాప్‌కు కొత్తగా ‘పిన్ రీసెంట్ పేమెంట్స్’ అనే ఫీచర్‌ను యాడ్ చేసింది. స్పెసిఫిక్ కాంటాక్ట్స్‌కి తరచుగా పేమెంట్స్ చేసే వ్యక్తులకు ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే యూజర్ పిన్ చేసిన ప్రొఫైల్ ఎల్లప్పుడూ టాప్‌లో కనిపిస్తుంది. కాబట్టి పేమెంట్స్ త్వరగా, సులభంగా చేయవచ్చు. అయితే ప్రస్తుతం టాప్‌లో ఐదు కాంటాక్ట్స్‌ను మాత్రమే పిన్ చేయవచ్చు.. భవిష్యత్ లో పెరిగే అవకాశాలు ఉందని సమాచారం..
ఈ ఫీచర్ కోసం పేటీఏం ను లేటెస్ట్ వన్ డౌన్లోడ్ చేసుకోవాలి.. ఈ ఫీచర్ ను ఎలా వాడాలంటే..
*. UPI మనీ ట్రాన్స్‌ఫర్‌లో ‘టూ మొబైల్’ లేదా ‘కాంటాక్ట్’పై క్లిక్ చేయండి
*.ఐకాన్స్ లేదా సెర్చ్ రిజల్ట్‌పై లాంగ్ ప్రెస్ చేయండి.
*. చివరగా ‘పిన్’పై క్లిక్ చేయండి.
అప్పుడే ఈ ఫీచర్ యాప్ లో యాక్టివేట్ అవుతుంది.. ఆ తర్వాత మీకు నచ్చిన ఐదు కాంటాక్ట్ లను యాడ్ చెయ్యండి.. మీరు మనిని ఒకేసారి పంపొచ్చు.. ఇండియన్ మల్టినేషనల్ ఫైనాన్సియల్ టెక్నాలజీ కంపెనీ పేటీఎం డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసులు అందిస్తుంది. తాజాగా పేటీఎం UPI పేమెంట్స్‌ను వేగవంతం చేయడానికి అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్‌ను తీసుకొచ్చింది… మున్ముందు మరిన్ని ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం..