ఆన్‌లైన్ కస్టమర్లకు డిసెంబర్ 1 నుంచి కొత్త కష్టాలు ఎదురుకాబోతున్నాయి. ఏ పని చేసుకోవాలన్నా.. ఓటీపీ మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటీపీ ఎంటర్ చేయకపోతే ఏ పని జరగదు. అయితే రెండు రోజుల తర్వాత ఓటీపీ ఇబ్బందులు తలెత్తబోతున్నాయి. దీంతో ఆన్‌లైన్ సేవలపై ఆధారపడే వాళ్లకు మాత్రం చుక్కలు కనబడనున్నాయి ఆర్థిక నేరాలను అరికట్టేందుకు భారత టెలికాం రెగ్యులెటరీ అథారిటీ(TRAI) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి నకిలీ ఫోన్ కాల్‌లు, మెసేజ్‌లను అరికట్టేందుకు కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీని కారణంగా ఇకపై ఓటీపీ మెసేజ్‌లు కాస్త ఆలస్యంగా రానున్నాయి.
ఇది కూడా చదవండి: Uddhav Thackeray: ‘‘కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ మమ్మల్ని ముంచింది’’.. మహా ఓటమితో విభేదాలు..
బ్యాంక్, ఫుడ్ డెలివరీ, పీఎఫ్.. ఇలా ఏ పని చేసుకోవాలన్నా ఓటీపీతోనే పనవుతుంది. ఇది కస్టమర్ల భద్రత కోసం ఇలా జరుగుతోంది. అయితే ఇది కూడా దుర్వినియోగం అవుతున్నట్లుగా ట్రాయ్ గుర్తించింది. పలువురు నుంచి భారీగా నగదు కోల్పోయిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ ఫోన్ కాల్‌లు, సందేశాలను అరికట్టేందుకు ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీని కారణంగా డిసెంబర్ 1 నుంచి మెసేజ్‌లు ఆలస్యంగా రానున్నాయి. ఒక వేళ ఓటీపీ రాకపోతే ఎలాంటి లావాదేవీలు చేయలేరు. దీంతో ఆన్‌లైన్ కస్టమర్లు ఇబ్బందులు పడకతప్పదు.
ఇది కూడా చదవండి: TG Congress MP’s: మా పనితీరును కేంద్ర మంత్రులే మెచ్చుకుంటున్నారు..
ఆయా కంపెనీలు నవంబర్ 30లోగా ట్రాయ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ట్రాయ్ నిబంధనలకు కంపెనీలు ఓకే చెప్పాలి. లేకుంటే డిసెంబర్ 1 నుంచి ఓటీపీలు ఆగిపోతే… దీంతో డెలివరీ సంస్థలు గానీ.. బ్యాంకులు గానీ.. మొబైల్ సంస్థలు గానీ ఇబ్బందులు పడక తప్పదు. ఈ తిప్పలన్నీ కస్టమర్లు పడాల్సి వస్తుంది. ఓటీపీ ఆలస్యం కాకుండా ఉండాలంటే ట్రాయ్ నిబంధనలకు కట్టుబడి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఇదంతా కస్టమర్ల భద్రత కోసమేనని ట్రాయ్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Ajmer Dargah: అజ్మీర్ దర్గా నిజంగా శివాలయమా..? ఆధారాలు ఏం చెబుతున్నాయి..?