పాల ధరలను మరోసారి పెంచేసింది మదర్ డెయిరీ.. ఢిల్లీ-ఎన్సీఆర్ నగరంలో మదర్ డెయిరీ లీటరు పాలపై 2 రూపాయలు చొప్పున పెంచుతూ ఇవాళ నిర్ణయంతీసుకోగా… పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.. అన్ని రకాల పాలకు పెరిగిన ధరలు వర్తిస్తాయని పేర్కొంది మదర్ డెయిరీ.. ధర పెంపుకు కారణం ఖర్చులు పెరగమే అంటోంది మదర్ డెయిరీ.. 2019లో పాల ధరలు పెంచగా.. కరోనా మహమ్మారి సమయంలో.. పాల సేకరణ, ప్రాసెస్, ప్యాకింగ్, రవాణ ఖర్చులు…