LIC Super Policy: ఈ ఎల్ఐసీ పాలసీతో రూ.4 లక్షలు ఆదాయం.. మహిళలకు మాత్రమే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలకు ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది.. మహిళలను ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని విధాల సాయం చేస్తుంది.. అందులో ప్రభుత్వ భీమా సంస్థ ఎల్ఐసి మహిళల కోసం ప్రత్యేక పథకాన్ని అందిస్తుంది. ఈ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చు..ఎల్ఐసీ ఆధార్ శిల పేరుతో ఈ పాలసీ అందుబాటులో ఉంది…ఇది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, సేవింగ్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకం. కేవలం మహిళలు మాత్రమే ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. మహిళలకు సేవింగ్స్‌తో పాటు రక్షణ కూడా అందించడం ఈ పాలసీ ప్రత్యేకత. ఈ పాలసీకి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పాలసీ తీసుకోవాలంటే 8 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు 55 ఏళ్లు. పాలసీ టర్మ్ కనీసం 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లు. సమ్ అష్యూర్డ్ విషయానికి వస్తే కనీసం రూ.2,00,000 నుంచి గరిష్టంగా రూ.5,00,000 వరకు పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియం నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి ఓసారి చెల్లించవచ్చు.. ఇది స్కీమ్ లో ఆడపిల్లలు కూడా చేరవచ్చు..
Also Read
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
ఇకపోతే 30 ఏళ్ల వయస్సు ఉన్న ఓ మహిళ రూ.3,00,000 సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల టర్మ్ ఎంచుకొని ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ తీసుకున్నారనుకుందాం. రోజూ రూ.30 చొప్పున ఏటా రూ.10,959 ప్రీమియం చెల్లించాలి. మెచ్యూరిటీ నాటికి రూ.3,97,000 రిటర్న్స్ వస్తాయి. చెల్లించిన ప్రీమియంతో పాటు బోనస్ కూడా వస్తుంది..అదే 35 ఏళ్ల వయస్సు ఉన్న ఓ మహిళ రూ.2,00,000 సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల టర్మ్ ఎంచుకొని ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ తీసుకున్నారనుకుందాం. రోజూ రూ.22 చొప్పున ఏటా రూ.7,860 ప్రీమియం చెల్లించాలి. మెచ్యూరిటీ నాటికి రూ.2,33,000 రిటర్న్స్ వస్తాయి..
ఈ పాలసీ తీసుకున్న తర్వాత మహిళ ఏదైనా కారణం చేత చనిపోతే నామినీకి డబ్బులు చెల్లిస్తుంది ఎల్ఐసీ. పాలసీ తీసుకున్న ఐదేళ్ల లోపు మరణిస్తే సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ లభిస్తుంది. ఐదేళ్ల తర్వాత మరణిస్తే లాయల్టీ అడిషన్ కూడా లభిస్తుంది. పాలసీ తీసుకున్న తర్వాత రెండేళ్లు పూర్తి ప్రీమియంలు చెల్లిస్తే లోన్ సదుపాయం కూడా ఉంటుంది.. అలాగే పన్ను మినహాయింపు కూడా ఉంది..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..