తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది రిలయన్స్ జియో… ‘ఎమర్జెన్సీ డేటా లోన్’ సదుపాయాన్ని ప్రారంభించింది.. డేటా పూర్తిగా అయిపోయి బ్రౌజింగ్‌కు ఇబ్బందులు తలెత్తితే.. ఆ వెంటనే ఎమర్జెన్సీ డేటా లోన్ తీసుకునే సౌలభ్యాన్ని తీసుకొచ్చింది జియో.. ఈ డేటాను తొలుత వాడుకుని తర్వాత చెల్లించేలా ఐదు డేటా లోన్ ప్లాన్లను తీసుకొచ్చింది జియో.. ఒక్కో ప్యాక్‌తో ఒక జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఈ విధానంలో తొలుత డేటాను ఉపయోగించుకుని దానికయ్యే మొత్తాన్ని ఆ తర్వాత చెల్లించొచ్చు. ప్రస్తుత డేటా ప్యాక్ అయిపోయిన తర్వాత మరో డేటా టాప్‌ను కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ డేటా లోన్ ఎంతగానో యూజర్లకు ఉపయోగపడనుంది..
ఎమర్జెన్సీ డేటా లోన్ ప్యాక్‌తో ఒక జీబీ డేటా అందిస్తారు.. ఈ ప్యాక్ విలువ 11 రూపాయలు. ఇక, డేటా కాలపరిమితి బేస్ ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది. జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు 1 జిబి చొప్పున 5 అత్యవసర డేటా లోన్ ప్యాక్‌లను తీసుకొచ్చింది.. ఈ అత్యవసర డేటా లోన్‌ను మైజియో యాప్ ద్వారా పొందే సదుపాయం ఉంది. చాలా మంది వినియోగదారులు తమ రోజువారీ డేటా కోటాను చాలా వేగంగా వినియోగించుకుంటున్నారు.. మిగతా రోజులలో హై స్పీడ్ డేటా లేకుండా ఇబ్బంది పడుతున్నారు.. ఇది గమనించిన జియో.. హై స్పీడ్ డేటాలో ఇబ్బందులు తలెత్తకుండా ఎమర్జెన్సీ డేటా లోన్ తీసుకొచ్చింది. అత్యవసర డేటా లోన్ సౌకర్యం.. వినియోగదారులకు సరళమైన మరియు శక్తివంతమైన పరిష్కారాన్ని అందిస్తుందని, బ్రేక్ లేకుండా హై స్పీడ్ డేటా అనుభవాన్ని కొనసాగించడానికి దోహదపడుతుందని చెబుతోంది జియో.