టెలికాం కంపెనీలు ఎన్ని ఉన్నా జియో రూటే సపరేటు. మిగతా టెల్కోలకంటే భిన్నంగా రకరకాల ఆఫర్స్ తో కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటుంది. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త రీచార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, జియో యాప్స్ కు యాక్సెస్ అందిస్తుంది. తక్కువ ధరలోనే ఎక్కువ డేటాను అందిస్తోంది. ఒకే రీచార్జ్ లో అదిరిపోయే బెనిఫిట్స్ పొందొచ్చు. మరి మీరు జియో కస్టమర్లు అయితే చౌకధరలో లభించే ఈ రీఛార్జ్ ప్లాన్లపై ఓ లుక్కేయండి.
జియో రూ. 249 రీఛార్జ్ ప్లాన్
జియో రూ. 249 రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 1GB డేటా పొందొచ్చు. దీనితో పాటు, అన్ లిమిటెడ్ కాలింగ్, 100 SMSలు లభిస్తాయి.
Also Read:Devi Movie : ‘దేవి’లో పాము కాటుకు వ్యక్తి బలి.. షాకింగ్ విషయం బయటపెట్టిన డైరెక్టర్
జియో రూ. 299 రీఛార్జ్ ప్లాన్
జియో రూ. 299తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. రోజుకి1.5 జీబీ డేటా వస్తుంది. ఉచిత కాల్స్, రోజుకు 100 SMSలు కూడా వస్తాయి.
జియో రూ. 399 రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల వాలిడిటీ పొందొచ్చు. రోజుకు 2.5GB డేటా వస్తుంది. అంతేకాకుండా ఆన్ లిమిటెడ్ ఉచిత కాల్స్, రోజుకు 100 SMSలు పొందొచ్చు.
Also Read:Deputy CM Pawan Kalyan: ముగిసిన పవన్ దక్షిణాది రాష్ట్రాల పర్యటన.. ఇలా సాగింది..
రూ.799 ప్లాన్
జియో రూ.799 ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. రోజుకు 1.5జీబీ డేటా వస్తుంది. అపరిమిత కాల్స్, డైలీ 100 ఎస్ఎంఎస్ వస్తాయి. అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్లను కూడా పొందవచ్చు.