హాల్ మార్కింగ్ నిబంధనల అమలులో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని… ద ఆల్ ఇండియా జెమ్ అండ్ జువలరీ డొమెస్టిక్ కౌన్సిల్ సమ్మెకు పిలుపునిచ్చింది. రేపు సమ్మె చేపట్టనుంది. జులై 16 నుంచి దశల వారీగా దేశంలో హాల్ మార్కింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తొలిదశలో 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 256 జిల్లాల్లో హాల్ మార్కింగ్ నిబంధన తప్పనిసరి చేసింది కేంద్రం. అయితే ఈ విధానానికి నిరసనగా… రేపు సమ్మె చేయాలని జీజేసీ పిలుపు నిచ్చింది. సమ్మె అంశాన్ని పునఃపరిశీలించాలని కోరారు బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారి. దాదాపు అన్ని అసోసియేషన్లు కొత్త విధానాన్ని ఆహ్వానిస్తున్నాయని… కొన్ని సంస్థలు వ్యతిరేకించడం సరికాదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రకస్తే లేదని చెప్పారు.