ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ముందు మోడీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఉపయోగించి భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. సెల్ ఫోన్స్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
బుధవారం పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. త్వరలో ఓట్ల జాతర జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి తరుణంలో తాజాగా కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
Gold Silver Import Duty: బడ్జెట్‌కు ముందే సామాన్యులకు షాక్ తగిలింది. ఆర్థిక శాఖ బంగారం, వెండిపై కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 12.50 శాతం నుంచి 15 శాతానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ పెంచింది.
Today Business Headlines 27-03-23: టీసీఎస్ రాజన్నకు అవార్డు: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ రీజనల్ హెడ్ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి.రాజన్నకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఈ పురస్కారంతో ఆయన్ని సత్కరించింది. రాజన్నకు సాఫ్ట్‌వేర్ సెక్టార్‌లో 30 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉంది. ఆ సుదీర్ఘ అనుభవం తెలంగాణ ఐటీ రంగం అభివృద్ధికి మరియు రాష్ట్ర ఆర్థిక పురోగతికి ఎంతగానో తోడ్పడుతుందని అసోసియేషన్ పేర్కొంది.
ఎలన్ మస్క్‌కు భారత్ మరోసారి షాక్ ఇచ్చింది. టెస్లా కార్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించేందుకు కేంద్రం నో చెప్పింది. అయితే, పాక్షికంగా తయారు చేసిన ఈవీ వాహనాలను ఇండియాలో అసెంబ్లింగ్ చేయడం ద్వారా దిగుమతి సుంకం తగ్గుతుందని కేంద్రం మరోసారి పేర్కొన్నది. టెస్లా కంపెనీ ఇండియాలో ఏర్పాటు చేసే ప్లాంట్, భవిష్యత్‌పై నివేదిక కోరగా, ఇప్పటి వరకు టెస్లా నుంచి ఎలాంటి సమాధానం రాలేదని, ఇప్పటికే దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలు తయారవుతున్నాయని, వివిధ విదేశీ కంపెనీలు పాక్షికంగా…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా నిత్యం వంటల్లో ఉపయోగించే వంటనూనె ధరలు ఆకాశాన్ని తాకాయి. సామాన్యుడికి వంటనూనెను కొనుగోలు చేయడం తలకు మించిన భారంగా మారింది. వంటనూనెను విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, విదేశాల్లో సోయాబీన్స్, పామాయిల్ ను బయోఉత్పత్తుల కోసం వినియోగిస్తుండటంతో ధరలు పెరిగాయి. ప్రస్తుతం కొత్త పంట చేతికి వస్తుండటంతో కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించింది. పామాయిల్ పై దిగుమతి సుంకం 10 శాతం నుంచి 2.5…