India-China : ట్రంప్ ప్రకటనతో చైనాకు షాక్.. భారత్‌కు లక్కీ ఛాన్స్ గురూ.. !
- డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
- చైనాపై ఎక్కువ టారిఫ్‌లు విధిస్తామని ప్రకటన
- అమెరికాలో పెరగనున్న చైనా వస్తువుల రేటు
- ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోనున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి పొరుగు దేశం చైనాకు నిత్యం ఇబ్బందికర వార్తలు వస్తూనే ఉన్నాయి. చైనాపై ఎక్కువ టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ గతంలో ప్రకటించారు. దీని వల్ల అమెరికాలో చైనా వస్తువుల రేటు పెరుగుతుంది. దీంతో విక్రయాలు తగ్గి చైనా కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది. ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (FIEO) అమెరికాకు ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఐదు కీలక రంగాలకు వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈ 5 రంగాల్లో ఎగుమతులను పెంచడం ద్వారా చైనాతో నేరుగా పోటీ పడాలని భారత్ యోచిస్తోంది. ఈ 5 రంగాల్లో ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, బట్టలు, రసాయనాలు, తోలుతో చేసిన పరికరాలు ఉన్నాయి.
ట్రంప్ ప్లాన్ ఏంటి?
వచ్చే ఏడాది జనవరి 20 నుంచి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. అధికారం చేపట్టిన తర్వాత కెనడా, మెక్సికోలపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలను పెంచుతామని ట్రంప్ కొద్ది రోజుల క్రితం తెలిపారు. అటువంటి పరిస్థితిలో.. చైనా నుంచి అమెరికాకు వస్తువులను ఎగుమతి చేయడం ఖరీదుగా మారుతుంది. దీంతో ఈ చైనా వస్తువులను అమెరికాలో విక్రయించాలంటే వాటి రేటు పెంచాల్సి వస్తుంది.
Also Read
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్‌కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
- LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
- UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
భారతదేశ ప్రణాళిక ఏమిటి?
ఈ సందర్భంగా భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (FIEO) వైస్ ప్రెసిడెంట్ ఇస్రార్ అహ్మద్ మాట్లాడుతూ.. “ఈసారి మనం చురుగ్గా ఉండాలి. ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, బట్టలు, రసాయనాలు, తోలు రంగాలకు చెందిన వస్తువులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఈ వ్యూహానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. ఈ వస్తువులను ఎగుమతి చేసేందుకు అవసరమయ్యే పెద్ద ఫ్యాక్టరీల సామర్థ్యం అవసరం. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్ (ఎంఎఐ) పథకం కింద మరిన్ని నిధులను కోరుతున్నాం. అలాగే ఎగుమతులపై జీడీపీ పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి. ఈ ప్రణాళిక ప్రకారం.. కనీసం మూడేళ్లపాటు అమెరికాపై దృష్టి పెట్టాలి. యుఎస్ మార్కెట్లో దూకుడును భారత్ అందిపుచ్చుకోవాలి. ” అని వెల్లడించారు.
భారత్- అమెరికా మధ్య వాణిజ్యం ఎలా ఉంది?
గత కొన్నేళ్లుగా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు పెరిగాయి. 2017 -2023 మధ్య ఎగుమతులు $36.8 బిలియన్లకు చేరుకున్నాయి. స్మార్ట్ఫోన్లు, టెలికాం పరికరాల్లో అత్యధిక వృద్ధి నమోదైంది. బట్టలు, మోటారు వాహనాల విడిభాగాలు, ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లు మొదలైన వాటి ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి.
చైనాపై ఎలాంటి ప్రభావం చూపనుంది?
భారత్ తన ప్రణాళికలో విజయం సాధిస్తే చైనాను వస్తువుల ఎగుమతుల్లో ఓడించవచ్చు. భారత్‌పై టారిఫ్‌ల విధింపుపై ట్రంప్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అటువంటి పరిస్థితిలో.. చైనా వస్తువులు అమెరికాలో ఎక్కువ రేటు పలుకుతాయి. భారతీయ వస్తువులు చౌకగా మారుతాయి. చైనీస్ వస్తువులు అమ్మకాలు తగ్గుతాయి. దీని కారణంగా భారతీయ కంపెనీలు అమెరికన్ మార్కెట్లో సులభంగా రాణించవచ్చు. దీని ప్రభావం చైనా కంపెనీలు, చైనా ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తుంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!