Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Explainer: ఒకప్పుడు ఇంట్లో డబ్బులు సరిపోకపోతే.. బంధువుల్ని అడిగేవాళ్లు, స్నేహితుడిని అడిగేవాళ్లు. చివరికి లోన్ కోసం బ్యాంక్‌కి వెళ్లేవాళ్లు. ఇప్పుడు మాత్రం చేతిలో ఉన్న ఫోన్ తీసి.. రెండు నిమిషాల్లో లోన్ తీసుకుంటున్నారు. 7వేలు కావాలా? వస్తాయి. 15వేలు కావాలా? వస్తాయి. పెద్దగా పేపర్‌వర్క్ అవసరంలేకుండానే అకౌంట్లో డబ్బు పడిపోతుంది. కానీ అసలు కథ అక్కడ మొదలవుతుంది.
హైదరాబాద్‌కు చెందిన ఓ ఉద్యోగి మొదట చిన్న లోన్‌తోనే మొదలుపెట్టాడు. ఇంట్లో అవసరానికి తీసుకున్నాడు. తీసుకున్న మొత్తం చిన్నదే. ఈఎంఐ కూడా భరించగలిగేదే. మళ్లీ డబ్బు అవసరమైనప్పుడు అదే యాప్‌లో మరో లోన్ తీసుకున్నాడు. ఎప్పుడో అత్యవసరానికి… ఎప్పుడో రోజువారీ ఖర్చులకు,, ఒకసారి ప్రోటీన్ సప్లిమెంట్స్ కొనడానికి కూడా తీసుకున్నాడు.
ఒక రోజు ఒక ఈఎంఐ మిస్ అయింది. అక్కడే కథ మలుపు తిరిగింది. పాత లోన్ కట్టడానికి కొత్త లోన్ తీసుకున్నాడు. ఒక లోన్.. రెండైంది. రెండు.. మరికొన్నయ్యాయి. చివరికి అప్పు తీర్చడానికి సంపాదించడం కాదు.. అప్పు కట్టడానికే అప్పు తీసుకునే పరిస్థితి వచ్చింది. సిబిల్ స్కోర్ దెబ్బతిన్నది. భవిష్యత్తులో సాధారణ బ్యాంకింగ్ క్రెడిట్ కూడా కష్టమైంది. ఇది ఒక్క హైదరాబాద్ ఉద్యోగి కథ కాదు. ఎక్స్పర్ట్ ప్యానెల్ అనే డెట్-రిజల్యూషన్ ప్లాట్‌ఫామ్ సర్వేలో సహాయం కోసం వచ్చిన డిస్ట్రెస్డ్ బారోయర్లలో దాదాపు 60 శాతం మంది కనీస చెల్లింపులు మాత్రమే చేస్తున్నారు లేదా రీపేమెంట్స్ ఆపేశారు. ప్రతి ఐదుగురిలో ఒకరికి అప్పటికే లీగల్ నోటీసులు వచ్చాయి. ఇంకో భయంకరమైన లెక్క ఉంది. దాదాపు 60శాతం మంది కుటుంబాల నెలవారీ ఈఎంఐలు.. కుటుంబం మొత్తం నెల ఆదాయానికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అంటే జీతం ఇంటికి రాకముందే.. దాని పెద్ద భాగం అప్పుదారుల దగ్గరికి వెళ్లిపోతోంది. 40శాతం మంది పాత అప్పులు తీర్చడానికి కొత్త లోన్లు లేదా క్రెడిట్ కార్డులు వాడుతున్నామని చెప్పారు. అయితే ప్రతి అప్పు విలాసం కోసం తీసుకున్నది కాదు.
Also Read
ఈ సర్వే ప్రకారం 26శాతం మంది వైద్య అత్యవసర పరిస్థితుల కోసం అప్పు చేశారు. 22 శాతం మంది చదువు, పెళ్లిళ్లు, కుటుంబ ఖర్చుల కోసం అడిగారు. 18శాతం మంది ఉద్యోగం లేదా వ్యాపార సమస్యల వల్ల చేశారు. మరో 15శాతం మంది కనీసం నెలను గడపడానికి అప్పు చేశారు.
అంటే ఈ కాలంలో అప్పు అంటే కొత్త ఫోన్, కొత్త కారు, ఖరీదైన జీవితం మాత్రమే కాదు. ఒక అనారోగ్యం. ఒక ఉద్యోగం పోవడం. జీతం ఆలస్యం కావడం. పిల్లల ఫీజు. ఇంట్లో అకస్మాత్తుగా వచ్చిన ఖర్చు. ఇవేవీ ఒక్కొక్కటిగా పెద్ద సమస్యలా కనిపించకపోవచ్చు. కానీ ఒకదాని మీద ఒకటి పడితే… కుటుంబం మొత్తం అప్పులోకి జారిపోవచ్చు. ఇదే సమయంలో డిజిటల్ లోన్ల ప్రపంచం మరింత వేగంగా పెరిగింది. 2022లో భారత డిజిటల్ లెండింగ్ మార్కెట్ విలువ 270 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2023లో అది 350 బిలియన్ డాలర్లకు చేరింది. లెండింగ్ యాప్‌ల వార్షిక మార్కెట్ దాదాపు 23 బిలియన్ డాలర్లకు చేరింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు 13 కోట్లకు పైగా లోన్లు మంజూరు చేశాయని బ్లూమ్‌బర్గ్ ఓపినియన్ ఆర్టికల్ చెబుతోంది. ఒక్కో లోన్ సగటు విలువ సుమారు 16 వేల రూపాయలు. వాటిలో ఎక్కువ భాగం మీడియం నుంచి హై రిస్క్ బారోయర్లకు వెళ్లినట్టు చెప్పింది. ఇక అప్పు తీసుకున్న తర్వాత మొదలయ్యేది మరో యుద్ధం. రోజుకు 300కు పైగా రికవరీ కాల్స్ వస్తున్నాయని కొందరు బాధితులు చెబుతున్నారు. ఆఫీసుకి కాల్స్. బాస్‌కి కాల్స్. బంధువులకు కాల్స్. ఇంటి దగ్గరకు వచ్చి ఒత్తిడి చేయడం.
అవమానించడం. బెదిరింపులు. అప్పు కేవలం బ్యాంక్ అకౌంట్లో ఉండదు. ఇంట్లోకి వస్తుంది. కుటుంబంలోకి వస్తుంది. మనసులోకి వస్తుంది. అందుకే అసలు ప్రశ్న.. భారతీయులు ఎంత అప్పు తీసుకుంటున్నారు అనేది కాదు. ఆ అప్పు వాళ్ల భవిష్యత్తును నిర్మిస్తోందా? లేదా.. ఈ నెలను గడిపేందుకు వచ్చే నెల జీవితాన్నే తాకట్టు పెడుతున్నారా?
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!