అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి పొరుగు దేశం చైనాకు నిత్యం ఇబ్బందికర వార్తలు వస్తూనే ఉన్నాయి. చైనాపై ఎక్కువ టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ గతంలో ప్రకటించారు. దీని వల్ల అమెరికాలో చైనా వస్తువుల రేటు పెరుగుతుంది. దీంతో విక్రయాలు తగ్గి చైనా కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది. ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలని ప్లాన్ చేస్తోంది.