Hurun India Rich List 2023: రిలియన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇండియా కుబేరుల్లో మొదటిస్థానంలో నిలిచారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి మొదటిస్థానంలో నిలిచారు. గతేడాది మొదటిస్థానంలో అదానీ ఉన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు వచ్చిన తర్వాత గౌతమ్ అదానీ సంపద హెచ్చుతగ్గులకు ప్రభావితమైంది. దీంతోనే ఈ ఏడాది ఇండియా అత్యధిక ధనవంతుల జాబితాలో ముకేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది.
హూరున్ ఇండియా మరియు 360 వన్ వెల్త్ సంయుక్త నివేదిక ప్రకారం హూరున్ ఇండియా రిచ్‌లిస్ట్ 2023ని విడుదల చేసింది. ఇది భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితా 12వ ఎడిషన్‌ని సూచిస్తుంది. ముకేష్ అంబానీ, అతని కుటుంబం ఆస్తుల విలువ రూ.. 8,08,700 కోట్ల నికర విలువతో అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్ అదాని, అతని కుటుంబ ఆస్తుల విలువ రూ.4,74,800 కోట్లతో, సైరస్ పూనావల్లా అండ్ ఫ్యామిలీ రూ.2,78,500 కోట్లతో తదుపరి స్థానాల్లో ఉన్నారు.
Read Also: Israel-Hamas: బందీలకు ఏమైనా జరిగితే ఊరుకోమన్న ఇజ్రాయిల్.. అలా అయితే బందీలను ఉరితీస్తామన్న హమాస్..
ఈ ఏడాది విడుదలైన హూరున్ రిపోర్ట్ ప్రకారం 1319 మంది వ్యక్తులు రూ. 1000 కోట్లకుపైగా నికర ఆస్తుల విలువను కలిగి ఉన్నారు. వీరిలో 219 మంది ఆస్తుల విలువ పెరిగింది. కొత్తగా ఈ జాబితాలోకి 219 మంది చేరారు. ఈ నివేదిక ప్రకారం.. ఈ ధనవంతుల సంపద సింగపూర్, యూఏఈ, సౌదీ అరేబియాల మొత్తం జీడిపిని అధిగమించి రూ. 109 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యక్తుల సంపద 8.5 శాతం పెరిగితే.. సగటున వ్యక్తుల సంపద 9.3 శాతం తగ్గిందని నివేదిక వెల్లడించింది.
ఈ జాబితాలోని 278 మంది కొత్త వారితో సహా మొత్తం 1054 మంది వ్యక్తుల సంపద వృద్ధి చెందడం లేదా స్థిరంగా ఉండటాన్ని నివేదిక హైలెట్ చేసింది. 264 మంది వ్యక్తుల సంపద క్షీణించినట్లు, 55 మంది ఈ జాబితా నుంచి తప్పుకున్నట్లు తెలిపింది. భారతదేశంలో 259 మంది బిలియనీర్లు ఉన్నారు, ఇది గతేడాదితో పోలిస్తే 38 శాతం పెరుగుదలను సూచిస్తుంది. పరిశ్రయలు, పారిశ్రామిక ఉత్పత్తులు, మెటల్ అండ్ మైనింగ్ జాబితాలోకి అత్యధిక మంది కొత్తగా చేరారు.. ఫార్మా నుంచి 133 మంది కొత్త వారు జాబితాలోకి వచ్చారు. జెప్టో వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా(20) అతి చిన్న వయస్సు సంపన్నుడిగా నివేదిక పేర్కొంది.