దేశంలో రోజురోజుకు సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఎంతో మంది బాధితులు విలవిలలాడారు. అయితే తాజాగా హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ అప్రమత్తం అయింది. తన కస్టమర్లను అప్రమత్తం చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో పావురాల రెట్టతో ప్రమాదం పొంచి ఉంది. దీంతో పావురాల ప్రభావిత కేంద్రాలపై నిషేధం విధించడానికి ఆప్ సర్కార్ యోచిస్తోంది. పావురాల రెట్టల కారణంగా ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ గుర్తించింది.
దేశ రాజధాని ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉంది. 41 ఏళ్ల తరువాత రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో వరద ముప్పు పొంచి ఉన్నట్టు సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) హెచ్చరించింది.
పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ ఆందోళన చేపట్టిన రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించింది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్. అంతేకాకుండా బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలను తేల్చేందుకు చేపట్టిన దర్యాప్తు కమిటీ రిపోర్టుపైనా ఆసంతృప్తి వ్యక్తం చేసింది.