ఈ రోజుల్లో దాదాపు అందరు బ్యాంకు అకౌంట్లను కలిగి ఉంటున్నారు. బ్యాంకు సేవలను వినియోగించుకుంటున్నారు. డిపాజిట్స్, లోన్స్, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు బ్యాంకు అకౌంట్లను తీసుకుంటున్నారు. దాదాపు బ్యాంకు సేవలన్నీ డిజిటల్ రూపంలోనే అందుతున్నాయి. అన్ని బ్యాంకులు ఆన్ లైన్ సేవలను అందిస్తున్నాయి. అయితే సైబర్ మోసాలు ఎక్కువవుతున్న తరుణంలో బ్యాంకులు టెక్నాలజీని అప్ గ్రేడ్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రముఖ ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. రెండు రోజులపాటు పలు సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఖాతాదారులకు సూచించింది. సర్వర్లు అప్ డేట్ చేస్తుండడంతో జనవరి 24, 25 తేదీల్లో బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని తెలిపింది. 24, 25 తేదీల్లో చాట్ బ్యాంకింగ్ SMS బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ IVR వంటివి అందుబాటులో ఉండవు. బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలు, రూపే క్రెడిట్ కార్డ్, హెచ్‌డిఎఫ్‌సి మొబైల్ బ్యాంకింగ్ యాప్, టిపిఎపి (థర్డ్ పార్టీ యాప్)లో యుపిఐ సేవపై యుపిఐ లావాదేవీలు మూసివేయబడతాయి.
చాట్‌బ్యాంకింగ్, SMS బ్యాంకింగ్, ఫోన్‌బ్యాంకింగ్ IVR సేవలపై జనవరి 24వ తేదీ రాత్రి 10:00 నుండి జనవరి 25వ తేదీ ఉదయం 2:00 గంటల వరకు అంతరాయం ఏర్పడనుందని బ్యాంకు ప్రకటించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కస్టమర్లకు ఇమెయిల్ ద్వారా అందిస్తోంది. రెండు రోజులపాటు బ్యాంకు సేవలకు అంతరాయం కలగనున్న నేపథ్యంలో బ్యాంకు పనులు ఉన్నవారు ముందే చూసుకోవడం బెటర్. కానీ, అంతరాయం ఉన్నప్పటికీ ఇతర ఆప్షన్ల ద్వారా బ్యాంకు సేవలను పొందొచ్చు.