డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాక చేతిలో నగదు ఉంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఏ సమయంలోనైనా ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేసుకునే సౌకర్యం ఉండడంతో అంతా ఈ విధానానికే అలవాటుపడిపోయారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. కాగా రేపు ఆ బ్యాంక్ ఖాతాదారులకు యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు దిగ్గజ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ సిస్టమ్ మెయిన్ టెనెన్స్ చేపడుతున్నట్లు వెల్లడించింది. దీంతో రేపు కొంత సమయం పాటు యూపీఐ సేవలు నిలిచిపోనున్నట్లు ఖాతాదారులకు సమాచారం చేరవేసింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఈ నెల 22న అర్థరాత్రి 2.30 గంటల నుంచి మార్నింగ్ 7 గంటల వరకు యూపీఐ సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అంటే 4.30 గంటల పాటు యూపీఐ సేవలు నిలిచిపోతాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాను యూపీఐ పేమెంట్ యాప్స్ కు లింక్ చేసుకున్న వారు ఇది గమనించాలని కోరింది. బ్యాంక్ సూచించిన ఆ సమయంలో యూపీఐ ఖాతాదారులు ట్రాన్సాక్షన్స్ చేయలేరు. ఈ సమయంలో డబ్బులు అవసరం అవుతాయనుకునే వారు ముందుగానే కొంత డబ్బు విత్ డ్రా చేసుకోవడం బెటర్. లేదా హెచ్డీఎఫ్సీ వారి పేజ్యాప్ (PayZapp) వాడుకోవచ్చని బ్యాంక్ అధికారులు తెలిపారు.