దేశంలో మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను(GST) రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. వ్యాట్ స్థానంలో తీసుకురాబడిన జీఎస్టీ ఊహించిన దానికంటే మెరుగైన పనితీరును కనబరుస్తోంది. మార్చిలో రూ. 1.78 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 11.5 శాతం ఎక్కువ. ఇది ఇప్పటి వరకు రెండవ అత్యధిక వసూళ్లు కావటం గమనార్హం.
దేశీయ స్టాక్ మార్కెట్‌లో రికార్డు లాభాలు కొనసాగుతున్నాయి. నిన్న భారీ లాభాలను ఆర్జించిన సూచీలు మంగళవారం సైతం అదే జోరును కొనసాగించాయి. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు పెరిగింది. ఉదయం స్వల్పంగా లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత భారీగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ కొత్త గరిష్ఠాలను తాకింది. సెన్సెక్స్ 431.02 పాయింట్లు పెరిగి 69,296.14 పాయింట్ల కొత్త రికార్డుకు చేరుకోగా.. నిఫ్టీ కూడా 168.50 పాయింట్లు పెరిగి 20,855.30…