వామ్మో.. సిల్వర్ ధర మళ్లీ తాండవం ఆడుతోంది. గతేడాది విశ్వరూపం సృష్టించిన ధరలు.. ఈ ఏడాది కూడా సునామీ సృష్టిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలోనే వెండి ధర భారీగా పెరిగిపోయింది. ఈరోజు కిలో వెండిపై రూ.10,000 పెరగగా.. తులం గోల్డ్‌పై రూ. 1,690 పెరిగింది. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో ఘోర విషాదం.. రూమ్ హీటర్ పేలి కుటుంబం దుర్మరణం
సంక్రాంతికి సిల్వర్ ధర హీటెక్కిస్తోంది. ఈరోజు ఏకంగా కిలో వెండిపై రూ.10,000 పెరిగింది. దీంతో రికార్డ్ స్థాయిలో ధర దూసుకుపోతుంది. ఇక బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,70, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,87,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,70, 000 దగ్గర అమ్ముడవుతోంది. అతి త్వరలోనే రూ.3 లక్షల మార్కుకు చేరిపోనుంది.
ఇది కూడా చదవండి: US: లాస్‌ఏంజిల్స్‌లో ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు.. దూసుకొచ్చిన వ్యతిరేక ట్రక్కు.. పలువురికి గాయాలు
ఇక ఈరోజు తులం గోల్డ్‌పై రూ.1,690 పెరగగా బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,150 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,550 పెరగగా రూ.1,30,300 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,270 పెరగగా రూ.1,06,610 దగ్గర ట్రేడ్ అవుతోంది.