బంగారం ధరలు ఠారెత్తిస్తున్నాయి. శుభకార్యాలకు కచ్చితంగా బంగారం కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో సామాన్యులు హడలెత్తిపోతున్నారు. ఈ రీతిలో ధరలు పెరిగిపోవడంతో కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. అంతర్జాతీయంగా ఎలాంటి ఉద్రిక్తతలు లేకపోయినా.. ఈ రేంజ్‌లో పెరిగిపోవడం ఏంటో అర్థం కావడం లేదు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ. 2,400 పెరగగా.. కిలో వెండిపై రూ.4,000 పెరిగింది.
ఇది కూడా చదవండి: Mexican Plane crash: కూలిన మెక్సికో నేవీ విమానం.. 2 ఏళ్ల చిన్నారి సహా ఐదుగురు మృతి
బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.2,400 పెరిగి.. రూ.1,38,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 2,200 పెరిగి రూ.1,27,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,800 పెరిగి రూ.1,03,910 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ఈడీ, సీబీఐ బీజేపీకి ఆయుధాలు.. జర్మనీలో రాహుల్ గాంధీ విమర్శలు
ఇక సిల్వర్ ధర భారీ షాకిచ్చింది. ఈరోజు కిలో వెండిపై రూ.4,000 పెరిగింది. దీంతో రికార్డ్ స్థాయిలో ధర దూసుకుపోతుంది. బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండి ధర రూ.2,23, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నై బులియన్ మార్కెట్‌లో మాత్రం రూ.2,34,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,23, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.