ఈ మధ్య వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. నిన్నటి నుంచి మళ్లీ పెరుగుతూ పోతోంది.. హైదరాబాద్ మార్కెట్‌లో రూ.380 పెరిగిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,840కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరిగడంతో రూ.43,850కి ఎగబాకింది.. మరోవైపు.. వెండి ధర కూడా పసిడి బాటే పట్టింది.. ఇవాళ రూ.1300 పెరగడంతో కిలో వెండి ధర రూ.65,100కు చేరింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర దిగివచ్చింది.. ఔన్స్‌కు 0.87 శాతం తగ్గుదలతో పసిడి రేటు ఔన్స్‌కు 1763 డాలర్లకు క్షీణించగా… వెండి రేటు ఔన్స్‌కు 1.44 శాతం తగ్గుదలతో 22.57 డాలర్లకు పడిపోయింది.