Gold and Silver Price: బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.. దేశంలో మరోసారి పెరిగాయి పసిడి ధరలు.. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో పసిడి ధరలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.. ఇవాళ బంగారం ధరలు పైకి కదిలాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,270 నుంచి రూ.56,440కి చేరగా.. ముంబైలో రూ.56,120 నుంచి రూ.56,290కి ఎగబాకింది.. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,070 దగ్గర కొనసాగుతోంది.. ఇక, కోల్‌కతాలో రూ.56,120 నుంచి రూ.56,290కి చేరితే.. బెంగళూరులో రూ.56,170 నుంచి రూ.56,340కి ఎగిసింది.. మరోవైపు.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం ధర రూ.56,120 నుంచి రూ.56,290 దగ్గర ట్రేడ్ అవుతోంది..
Read Also: YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు..
ఇక, పసిడి ధరలు పెరిగి.. వెండి ధరలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.. కొన్ని చోట్ల పెరిగితే.. మరికొన్ని చోట్ల తగ్గుముఖం పట్టాయి.. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 66,800 వద్ద స్థిరంగా కొనసాగుతుండగా.. ముంబైలోనూ ఎలాంటి మార్పు లేకుండా రూ.66,800గా ఉంది. అయితే, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.69,000 నుంచి రూ.69,200కి పెరిగింది.. కోల్‌కతాలో రూ.66,800 దగ్గర స్థిరంగా ఉండగా.. బెంగళూరులో రూ.69,000 నుంచి రూ.69,200కి.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో రూ.69000 ఉంచి రూ.69,200కి పెరిగింది. అయితే, పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. పసిడికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని.. దీంతో.. వాటి ధరలు మరింత పైకి ఎగబాకే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.