Gold and Silver Price: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ చెబుతూ.. పైపైకి ఎగబాబుకుతోంది పసిడి ధర గత మూడు రోజుల్లోనే వెయ్యి రూపాయలకు పైగా పైకి కదిలింది బంగారం రేటు.. ఇక, ఇవాళ కూడా మరింత పెరిగింది.. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 100 పెరిగితే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50పైకి ఎగిసింది.. మరోవైపు పసిడి దారిలోనే వెండి కూడా పెరిగింది.. కిలో వెండి ధర ఈ రోజు రూ.100 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,160కి చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.56,890 దగ్గర కొనసాగుతోంది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ. 68,800గా పలుకుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,160గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 56,890 దగ్గర కొనసాగుతోంది.
Read Also: Naatu Naatu Song: అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన “నాటు నాటు…”!
భారత్‌లో ఇతర నగరాల్లో బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,300గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,040గా ట్రేడ్ అవుతోంది.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,710గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,500గా పలుకుతోంది.. ఇక, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,200గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,940గా ట్రేడ్ అవుతోంది.. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అహ్మదాబాద్‌లో రూ. 52,210గా.. జైపూర్‌లో రూ. 52,310, లక్నోలోరూ.52,310, భువనేశ్వర్ లో రూ. 52,210గా ఉంది. ఇక విదేశాల్లో బంగారం ధరలు చూస్తే.. మలేషియా: 2,700 రింగ్గిట్ (రూ.48,967), దుబాయ్: 2095 దిర్హామ్ (రూ46,755), అమెరికా: 575 డాలర్ (రూ47,130), సింగపూర్: 784 సింగపూర్ డాలర్ (రూ.47,639), ఖతార్: 2,165 ఖతార్ రియాల్ (రూ.48,738), కువైట్: 179 కువైట్ దినార్ (రూ.47,786)గా ఉన్నాయి.