ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మాన్యుమెంటల్ సేల్ ను ప్రారంభించింది. జనవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సేల్ స్టార్ట్ అయ్యింది. జనవరి 19 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ తమ ప్రొడక్ట్స్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. మొబైల్స్, టీవీ అండ్ అప్లియెన్సెస్, స్మార్ట్ గాడ్జెట్స్, హోమ్ అండ్ కిచెన్, ఫ్యాషన్ ఉత్పత్తులపై వేలల్లో తగ్గింపును అందిస్తోంది. మీరు కొత్త వస్తువులను కొనాలనే ప్లాన్ లో ఉంటే ఈ సేల్ ను యూజ్ చేసుకుని వేలల్లో లాభం పొందొచ్చు. HDFC క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసి 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఎలక్ట్రానిక్స్ లో భారీ ఆఫర్లు ప్రకటించింది. ఐఫోన్ 16, గెలాక్సీ S24 ప్లస్, మోటోరోలా ఎడ్జ్ ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఐఫోన్ 16 మోడల్‌పై రూ. 10 వేల తగ్గింపుతో రూ.63,999 కే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.73,999, ఐఫోన్ 16 ప్రో ధర రూ.1,02,900 గా ఉంది. దీంతోపాటు గెలాక్సీ S24 ప్లస్ మోడల్‌ను రూ.59,999 కే సొంతం చేసుకోవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ రూ. 19,999గా ఉంది. ఈ మోడళ్లతోపాటు షియోమీ, పోకో, వివో, ఐకూ సహా ఇతర బ్రాండ్‌ల ఫోన్‌లను తక్కువ ధరలకు సొంతం చేసుకోవచ్చు.
ల్యాప్ టాప్ యాక్సెసరీస్ రూ. 99 ధరలతో లభిస్తాయి. మౌస్ కీబోర్డ్స్ రూ. 149కే అందుబాటులో ఉన్నాయి. పెన్ డ్రైవ్ ఎస్డీ కార్డ్స్ రూ. 299కే వచ్చేస్తున్నాయి. బెస్ట్ సెల్లింగ్ ల్యాప్ టాప్స్ రూ. 10,990కే సొంతం చేసుకోవచ్చు. ఇక టీవీల విషయానికి వస్తే.. 4K అండ్ QLED TVs రూ. 15,999కే అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్, సోనీ, మోటోరోలా, రియల్‌మి, రెడ్‌మి, Mi వంటి బ్రాండ్‌లను భారీ తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు.
వాషింగ్ మెషిన్స్ రూ.6,790 ధరకే లభిస్తున్నాయి. రూమ్ హీటర్స్ రూ. 799కే దక్కించుకోవచ్చు. మిక్సర్ గ్రైండర్స్ రూ. 999కే అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ గాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. స్మార్ట్ వాచ్ లు కేవలం రూ. 899కే అందుబాటులో ఉంచింది. ఫాస్ట్ పవర్ బ్యాంక్స్ 50 శాతం డిస్కౌంట్ తో కొనుగోలు చేయొచ్చు. ఛార్జర్స్ అండ్ కేబుల్స్ పై 70 శాతం తగ్గింపు లభిస్తోంది.