Flipkart Black Friday Sale: ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈసారి “బ్యాగ్ ది బిగ్గెస్ట్ డీల్స్” అనే ట్యాగ్‌లైన్‌తో డిస్కౌంట్లను తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తు్న్నట్లు తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్‌లు, గృహోపకరణాల వరకు వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించింది. అమెజాన్ కూడా త్వరలో తన బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రకటించవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో తగ్గింపులు ఏవిధంగా ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Dhanush: సరదాగా చేస్తే.. ఇన్నేళ్లుగా వెంటాడుతుంది..
సేల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే..
ఫ్లిప్‌కార్ట్ తన బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 నవంబర్ 23న ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఈ సేల్ కోసం కంపెనీ ఒక ప్రత్యేక మైక్రోసైట్‌ను విడుదల చేసింది. ఇది వివిధ రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రదర్శిస్తుంది. 2025 దీపావళి సేల్ తర్వాత ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న మొదటి ప్రధాన సేల్ ఇదే కాబట్టి, ఇది కొనుగోలుదారులకు గొప్ప అవకాశంగా మారుతుందని ఆన్‌లైన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సేల్ సమయంలో ప్రీమియం ఎలక్ట్రానిక్స్ నుంచి బడ్జెట్ గాడ్జెట్‌ల వరకు అనేక వస్తువులు తగ్గింపు ధరలలో వస్తాయని కంపెనీ పేర్కొంది.
ఈసారి ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టీవీలు, హోమ్ థియేటర్లు, వాషింగ్ మెషీన్లు, PCలు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, ACలు, రిఫ్రిజిరేటర్లు వంటి వాటిపై గణనీయమైన డిస్కౌంట్లను అందిస్తోందని వెల్లడించారు. Samsung, LG వంటి బ్రాండ్‌ల ఉత్పత్తులు కూడా ఈ సేల్‌లో తక్కువ ధరలకు లభిస్తాయని అన్నారు. అదనంగా ఈ సేల్‌లో రూమ్ హీటర్లు, గీజర్‌లు వంటి శీతాకాలపు ఎలక్ట్రానిక్స్ కూడా చేర్చారని వెల్లడించారు. వినియోగదారులు UPI, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులకు అవకాశం ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అలాగే ప్రారంభ డిస్కౌంట్లు, ఆఫర్లను సులభంగా పొందడానికి వినియోగదారులు తమ చెల్లింపు వివరాలను ముందుగానే సేవ్ చేసుకోవాలని Flipkart సిఫార్సు చేసింది. అయితే ఈ సేల్‌కు సంబంధించి భాగస్వామి బ్యాంక్ ఆఫర్లకు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా విడుదల కాలేదు.
అమెజాన్ సేల్ ఎప్పుడంటే..
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ తేదీలను ప్రకటించడంతో, త్వరలో అమెజాన్ కూడా బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఈ రెండు ఇ-కామర్స్ దిగ్గజాలు మార్కెట్‌లో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. ఈసారి కూడా అదే వాతావరణం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. 2025 దీపావళి సేల్ తర్వాత, ఇది రెండు ప్లాట్‌ఫామ్‌లకు తదుపరి ప్రధాన డిస్కౌంట్ ఈవెంట్ అవుతుందని, దీనిని వినియోగదారులు పూర్తిగా ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు.
READ ALSO: AP Chief Secretary: ఈ నెల 30న సీఎస్ పదవీ విరమణ..! రేసులో సీనియర్ ఐఏఎస్