ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ 5జీ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ స్మార్ట్ ఫోనో కంపెనీ అయిన మోటోరోలా తాజాగా బడ్జెట్ ఫ్రెండ్లీలో.. అదిరిపోయూ ఫీచర్లతో మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ మొబైల్స్ అట్రాక్టివ్ డిజైన్ తో పాటు ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 8జీబీ ర్యామ్, డ్యూయల్ రేర్ కెమెరా వంటి గొప్ప ఫీచర్లెన్నో ఇందులో ఉన్నాయి. దీని ధర కేవలం 20 వేల రూపాయలలోపు ఉండటం విశేషం.
Also Read : Anand Mahindra: మరోసారి ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్..
మోటో జీ73 మోడల్ పేరిట రిలీజవుతున్న ఈఫోన్లో ప్రస్తుతానికి ఒక వేరియంటు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ, మీడియాటెక్ డైమెన్సిటీ 930 ప్రాసెసర్ ( ఆక్టాకోర్ కోర్ 2.2GHz ), 50MP+8MP రియల్ కెమెరా, 16 మెగా పిక్సెల్ తో ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.5 LCD ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉన్నాయి. ఇన్ని ప్రత్యేక ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ధర భారత్ లో రూ. 18,999కు లభించనుంది. సంబంధిత బ్యాంక్ కార్డులను వాడితే రూ.2 వేల వరకు తగ్గే అవకాశం ఉందని మోటోరోలా కంపెనీ ప్రకటించింది. అంటే ఈ
మొబైల్ రూ. 16,999 ధరకే పొందే అవకాశం ఉందని తెలిపింది.
Also Read : Sajjala: వైసీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు
మోటోరోలా జీ73 స్మార్ట్ ఫోన్ మిడ్ పైట్ బ్లూ, లూసెట్ వైట్ అనే రెండు కలర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. మార్చి 16 తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ అమ్మకాల విక్రయాలు ప్రారంభమవ్వనున్నాయి. ముందుగా ఈ కామర్స్ ఫ్లిప్ కార్టులో మాత్రమే అందుబాటులో ఉంటుందని.. మోటోరోలా అధికారిక సైటులో కూడా లభిస్తుందని ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్లో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా ఉన్నాయి. వీటిలో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా లెన్స్ కూడా ఈ మొబైల్ లో ఉన్నాయి. ఈ కెమెరాతో ఫుల్ హెచ్ డీ వీడియోలను 60FPSతో రికార్డు కూడా చేయొచ్చు.. అంతేకాదు చీకట్లోనూ ఫొటో క్వాలిటీ బాగానే వస్తుందని వెల్లడించారు. గూగుల్ లెన్స్ ఇంటిట్రేషన్ కూడా ఇందులో వర్క్ చేస్తోంది.
Also Read : Nani: దసరా సినిమాకి కష్టాలు తప్పేలా లేవు… ఈ గండం నాని ఎలా దాటుతాడో ఏమో?
ఈ స్మార్ట్ ఫోన్స్ 5జీ, వైఫై. బ్లూటూత్ 5.3 వర్షన్, ఎఫ్ఎం రేడియో, యూఎస్బీ టైప్-సి, 3.5 హెడ్ ఫోన్ జాక్, స్టీరియో స్పీకర్, డ్యూయల్ మైక్రో ఫోన్, ఐపీ 52 వాటర్ రెసిస్టెంట్, లెనోవో థింక్ షీల్డ్ మొబైల్ ఉన్నాయి. ఇంకా సెక్యూరిటీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 30 వాట్స్ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే ఈ ఫోన్ 181 గ్రాముల బరువు ఉంటుంది.