Business Flash 12-07-22: మరికొన్ని ముఖ్యమైన బిజినెస్ వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ ఆర్థిక వ్యవస్థ స్థితి’గతి’ని మార్చే ‘శక్తి’
ప్రైమ్ మినిస్టర్ (పీఎం) గతిశక్తి పోర్టల్ దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతిని సమూలంగా మార్చనుంది. ఇండియా ఎకానమీని 2040 నాటికి 20 ట్రిలియన్ డాలర్లకు పెంచటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశలో ఈ నేషనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎంపీ) కీలక పాత్ర పోషించనుంది. అందుకే పీఎం గతిశక్తి పోర్టల్ అనే ఈ ఎన్ఎంపీని ఆర్థిక వ్యవస్థలో గేమ్ ఛేంజర్‌లా కేంద్రం అభివర్ణిస్తోంది. ఈ డిజిటల్ ప్లాట్‌ఫాంని మోడీ ప్రభుత్వం 2021 అక్టోబర్‌లో ప్రారంభించింది. దీని అమలుకయ్యే ఖర్చు 10 కోట్ల రూపాయలు. ఈ మెగా ప్లాన్‌లో 16 కేంద్ర మంత్రిత్వ శాఖలు పాల్గొననున్నాయి. అవి వివిధ ప్రాజెక్టులను ఒక ప్రణాళిక ప్రకారం అమలుచేస్తాయి.
Also Read
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్‌కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
మేలో 11 నెలల గరిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి!
వినియోగదారుడి ధరల పట్టిక (సీపీఐ) మే నెలలో పెరిగిందా లేదా అనేది ఈరోజు సాయంత్రం తేలిపోనుంది. ఆ నెలకు సంబంధించిన చిల్లర ధరల ద్రవ్యోల్బణం(రిటైల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్-ఆర్పీఐ), పారిశ్రామిక ఉత్పత్తి ఫలితాలు మరికొద్దిసేపట్లో విడుదల కానున్నాయి. ఆర్పీఐ 6.8 శాతం నుంచి 7.25 శాతం వరకు చేరుకునే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. జూన్ నెలలో ఆర్పీఐ 7.04 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు.. పారిశ్రామిక ఉత్పత్తుల పురోగతి మే నెలలో 11 నెలల గరిష్టానికి పెరుగుతుందని ఆశిస్తున్నారు. అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ 14.5 శాతం నుంచి 15.24 శాతానికి వృద్ధి చెందనుందని చెబుతున్నారు.
రూ.3600 కోట్లు సేకరించిన బైజుస్
ఎడ్యుకేషన్, టెక్నాలజీ (ఎడ్టెక్) ప్లాట్‌ఫామ్స్‌లో పేరొందిన బైజుస్ గత ఏడాది కాలంలో రూ.3600 కోట్లకు పైగా నిధులను సేకరించింది. దీంతో తమ ఫండ్ రైజింగ్ ప్రణాళికలు పట్టాలెక్కినట్లేనని ఆ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. మొత్తం 13 మంది పెట్టుబడిదారుల నుంచి నిధులు ఆశించగా ఇప్పటికి 11 మంది ఇన్వెస్టర్లు డబ్బులిచ్చినట్లు వెల్లడించింది. ఈ ఫండింగ్ రౌండ్ గతేడాది జూన్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!