RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI FD Rules 2026: బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారికి కీలక మార్పు రానుంది. అక్టోబర్ 1, 2026 నుంచి బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన వడ్డీ రేట్ల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసే ఖాతాదారులకు వడ్డీ రేట్ల విషయంలో మరింత పారదర్శకత కల్పించడమే..
ప్రతిరోజూ వడ్డీ రేట్లు వెల్లడించాలి
కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు ప్రతి పనిదినం బల్క్ ఎఫ్డీలపై వర్తించే వడ్డీ రేట్లను తమ వెబ్సైట్లో వెల్లడించాల్సి ఉంటుంది. బ్యాంకులు ఉదయం 10 గంటలలోపు ఆ రోజు వడ్డీ రేట్లను అప్డేట్ చేయాలి. ఇందుకోసం ఉదయం 10.10 గంటల వరకు అదనపు గడువు కూడా ఉంటుంది. ఆ రోజు బల్క్ ఎఫ్డీ చేసిన ఖాతాదారులకు వెబ్సైట్లో ప్రకటించిన రేట్లే వర్తించనున్నాయి. అయితే, ఈ నిబంధనలు ప్రధానంగా బల్క్ డిపాజిట్లకు వర్తిస్తాయి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో సాధారణంగా రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని బల్క్ డిపాజిట్‌గా పరిగణిస్తారు. అయితే ఇతర బ్యాంకుల వర్గాలను బట్టి బల్క్ డిపాజిట్ పరిమితులు భిన్నంగా ఉండవచ్చు. చిన్న మొత్తంలో సాధారణ ఎఫ్డీలు చేసే ఖాతాదారులపై ఈ ప్రత్యేక మార్పు నేరుగా ప్రభావం చూపదు. అంటే సాధారణ ఎఫ్డీ వడ్డీ రేట్లను ప్రతిరోజూ ఇలా వెల్లడించాల్సిన నిబంధన బల్క్ డిపాజిట్లకు సంబంధించినదే.
Also Read
- Stock Market Crash: నాలుగు రోజుల్లో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్న ఐదు కారణాలు ఇవే..
- EPFO Rules: పదవీ విరమణ తర్వాత PF డబ్బు వెంటనే తీసుకోవాలా? EPFO ఏం చెబుతోంది?
- PM Kisan: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ఆ రోజే డబ్బులు ఖాతాల్లోకి జమ..
- Reliance Jio IPO: కోటి దరఖాస్తులతో జియో సరికొత్త చరిత్ర..
బ్రాంచ్‌ల వారీగా వేర్వేరు రేట్లకు చెక్
కొత్త నిబంధనల్లో మరో ముఖ్యమైన అంశం ఉంది. ఒకే బ్యాంకులో ఒకే రోజున, ఒకే మొత్తానికి, ఒకే కాలపరిమితితో చేసే బల్క్ ఎఫ్డీలకు వివిధ శాఖలు తమ ఇష్టానుసారం వేర్వేరు వడ్డీ రేట్లు అందించే విధానానికి పరిమితులు విధించనున్నారు. అయితే, లిక్విడిటీ కవరేజ్ రేషియో (LCR)కు సంబంధించిన ప్రత్యేక నిబంధనల కారణంగా కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉండొచ్చు.
ఖాతాదారులకు ఏం ప్రయోజనం?
పెద్ద మొత్తంలో డబ్బును ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టే వ్యక్తులు, సంస్థలు ప్రతి పనిదినం బ్యాంకు వెబ్సైట్లో బల్క్ ఎఫ్డీ వడ్డీ రేట్లను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో వడ్డీ రేట్ల విషయంలో సమాచార లోపం తగ్గడంతో పాటు, బ్యాంకుల మధ్య రేట్లను పోల్చుకోవడం కూడా సులభం అవుతుంది. మొత్తంగా చూస్తే, కొత్త నిబంధనలు ప్రధానంగా బల్క్ ఎఫ్‌డీల వడ్డీ రేట్లను మరింత పారదర్శకంగా, క్రమబద్ధంగా వెల్లడించడంపై దృష్టి పెడుతున్నాయి. సాధారణ ఎఫ్డీ ఖాతాదారులు మాత్రం ఈ మార్పును తమ సాధారణ డిపాజిట్‌పై వర్తించే వడ్డీ రేటు మార్పుగా భావించాల్సిన అవసరం లేదు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!