బుల్లితెర సీరియల్ నటుడు మానస్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సీరియల్స్ లో నటించి జనాల మనసును దోచుకున్నాడు.. బిగ్ బాస్ లో కూడా మెరిసాడు.. ఇలా అందరికీ మానస్ సుపరచితమే.. వెండి తెరపై బాలనటుడిగా పరిచయం అయిన మానస్.. హీరోగా గోళీసోడా వంటి కొన్ని ల్లో నటించాడు. అనంతరం కోయిలమ్మ సీరియల్ తో బుల్లి తెరపై అడుగు పెట్టాడు. అయితే మానస్ కు వెండి తెరపై కంటే బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణ అధికం.. ఇక విషయానికొస్తే మానస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే..
సెప్టెంబర్ 2న మానస్ నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. శ్రీజ అనే విజయవాడకు చెందిన అమ్మాయితో మానస్ ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. తాజాగా మానస్ ఓ ఇంటివాడయ్యాడు.. విజయవాడలోని మురళీ రిసార్ట్స్ వేదికగా నిన్న నవంబర్ 22 బుధవారం రాత్రి మానస్ – శ్రీజల వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, పలువురు సినీ, టీవీ ప్రముఖుల మధ్య వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
ఆ ఫోటోలను చూసిన సీరియల్ అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.. ఇక కేరీర్ విషయానికొస్తే.. బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ గా తన నటనతో అందరి మనసులను గెలుచుకున్నాడు మానస్.. తన పాత్ర కుటుంబాన్ని ఎలా ముందుకు నడిపించాలో చూపిస్తుంది.. ఆ క్యారక్టర్ జనాలకు విపరీతంగా నచ్చేసింది.. పెళ్లి తర్వాత కొద్ది రోజులు సీరియల్స్ దూరం కాబోతున్నట్లు సమాచారం..